Curry Leaf Plant| కరివేపాకు మొక్కని పెంచుకునే విషయంలో ఈ తప్పులు చేస్తే సమస్యలు తప్పవు..!
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి ప్రత్యేక ప్రాధాన్యం ఉందని నిపుణులు చెబుతున్నారు. కరివేపాకు మొక్కను సరైన దిశలో నాటితే శ్రేయస్సు, ఆరోగ్యం, అదృష్టం కలుగుతుందని విశ్వసిస్తారు. ఇంట్లో కరివేపాకు మొక్క బాగా పెరగడం లక్ష్మీదేవి ఆశీర్వాదంగా పరిగణించబడుతుంది. అయితే సరైన ప్రదేశంలో నాటకపోతే విపరీతమైన ఫలితాలు వస్తాయని నమ్మకం.

#image_title
వాస్తు చూడాలి..
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి పడమర దిశ చంద్రుని దిశగా పరిగణించబడుతుంది. ఈ దిశలో మొక్కలు నాటితే శుభఫలితాలు వస్తాయి. కాబట్టి కరివేపాకు మొక్కను పడమర వైపున నాటడం ఆరోగ్యానికి మంచిదిగా చెప్పబడుతుంది. అలాగే దక్షిణ దిశలో నాటితే సంపద, శ్రేయస్సు లభిస్తుందని నమ్మకం ఉంది.
అయితే పడమర, దక్షిణ దిశల్లో పెంచినా ఇంటి గోడలకు దగ్గరగా కాకుండా కనీసం నాలుగు అడుగుల దూరంలో నాటాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంటి తోటలో ఈ మొక్కను పెంచడం ప్రతికూల శక్తిని తొలగించి ఆనందం, అదృష్టం తెస్తుందని చెబుతారు.ఇకపోతే కొన్ని ప్రదేశాల్లో మాత్రం కరివేపాకు మొక్కను నాటకూడదని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈశాన్య మూలలో నాటితే ఇంటివారికి దురదృష్టం, కష్టాలు, దుఃఖాలు వెంటాడతాయని చెబుతున్నారు.