Good News for Women : కస్టమ్స్ సుంకం తగ్గింపుతో మహిళలకు ‘బంగారం’లాంటి వార్త..!
ప్రధానాంశాలు:
Good News for Women : కస్టమ్స్ సుంకం తగ్గింపుతో మహిళలకు 'బంగారం'లాంటి వార్త..!
Good News for Women : వార్షిక బడ్జెట్ లో కేంద్రం కస్టమ్స్ సుంకం తగ్గించి ప్రజలకు పెద్ద భారాన్ని తగ్గించింది. కస్టమ్స్ సుంకంను 6 శాతానికి కేంద్రం తగ్గించగా వాటి వల్ల ముడి బంగారాన్ని కొనే వారికి భారీగా లాభం చేకూరుతుంది. మొన్నటివరకు 10 శాతం కస్టమ్స్ సుంకం మౌలిక సదుపాయాల అభివృద్ది సెస్ కు 5 శాతం కలిపి మొత్తం 15 శాతం సుంకం కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది. ఐతే ఇప్పుడు కస్టమ్స్ సుంకం 10 శాతం నుంచి 6 శాతం వరకు తగ్గించడం వల్ల మొత్తం 11 శాతం మాత్రమే కస్టమ్స్ సుంకం చెల్లించాలి. దీని వల్ల బంగారం ధరలో 4 వేల దాకా తగ్గుతుంది.
Good News for Women మహిళల ఆస్తులపై పన్ను తగ్గింపు..
వెండి ధరలో కూడా కిలో 4 వేల దాకా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. కస్టమ్స్ సుంకం తగ్గించిన ప్రభుత్వం తో ఆ ప్రభావం మహిళలు ఎంతగానో ఇష్టంగా చూసుకునే బంగారం, వెండి మీద పడుతుంది. ఇదే కాకుండా మహిళల పేరుతో కొనుగోలు చేసిన ఆస్తులపై కూడా పన్ను తగ్గింపు చేసేలా బడ్జెట్ లో ప్రస్తావించారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. మహిళలు కొనుగోలు చేసే ఆస్తులపై సుంకం తగ్గింపు కూడా వారికి ప్రోత్సాహకరంగా ఉండే అవకాశం ఉంటుంది.
పిల్లల భవిష్యత్తు కోసం సేవింగ్స్ చేసే పేరెంట్స్ కు కేంద్ర కొత్త అవకాశం ఇచ్చింది. NPS వాత్సల్య పేరుతో కేంద్రం కొత్త స్కీం తీసుకొచ్చింది. ఈ స్కీం లో మైనర్లు కూడా చేరే అవకాశం ఉంది. పిల్లల వయసు ఎంతైనా వారిని ఈ పథకంలో చేర్చి వారు మేజర్ వయసు వచ్చాక ఖాతా ఆటోమెటిక్ గా ప్రమోట్ అవుతుంది. పిల్లలు పెద్దయ్యాక వారికి ఆ మొత్తం వారికి అందుతుంది. ఇలా మొత్తానికి వార్షిక బడ్జెట్ లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ వారికి ఉపయోగపడే స్కీం లను కూడా తీసుకొచ్చారు.