7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. న్యూ ఇయర్ కానుకగా పెరగనున్న డీఏ.. ఎంతో తెలుసా?
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి గుడ్ న్యూస్ చెప్పబోతోంది. కొత్త సంవత్సరం సందర్భంగా కేంద్ర ఉద్యోగులకు న్యూ ఇయర్ బొనాంజా గిఫ్ట్ ను అందిస్తోంది. మరోసారి డీఏను పెంచేందుకు కేంద్రం సమాయత్తం అవుతిం. దీనికి సంబంధించిన డేటాను ఏఐసీపీఐ ఇండెక్స్ తాజాగా అందించింది. కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే.. డీఏ పెంపునకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే జులైలో డీఏ పెంచారు.
ప్రస్తుతం 38 శాతంగా డీఏ ఉంది. దాన్ని కొత్త సంవత్సరం కానుకగా జనవరి 2023 లో 4 శాతం పెంచే ఆలోచన చేస్తోంది. 4 శాతం పెరిగితే 38 శాతం నుంచి 42 శాతానికి డీఏ పెరగనుంది. దీని వల్ల మినిమిం వేతనం ఉన్న ఉద్యోగులకు కూడా డీఏ రూ.720 పెరగనుంది. ఎక్కువ జీతం ఉన్నవాళ్లకు కనీసం రూ.2276 వరకు జీతం పెరగనుంది. గత సెప్టెంబర్ నెల నుంచి ఏఐసీపీఐ ఇండెక్స్ 131.2 శాతంగా ఉంది. అది జూన్ – సెప్టెంబర్ 2022 కు సంబంధించిన డేటా. ఏఐసీపీఐ ఇండెక్స్ 2.1 శాతానికి పెరిగింది.
7th Pay Commission : 2.1 శాతానికి పెరిగిన ఏఐసీపీఐ ఇండెక్స్
గత నెలతో పోల్చితే ఆగస్టు నుంచి 1.1 శాతానికి పెరిగింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి బేసిక్ పే రూ.18 వేలు ఉంటే.. 42 శాతానికి డీఏను లెక్కిస్తే అది రూ.7560 గా ఉంది. 38 శాతానికి ఉంటే.. రూ.6840 గా ఉంది. అంటే 42 శాతానికి పెరిగితే రూ.720 పెరుగుతుంది. సంవత్సరానికి లెక్కిస్తే ఉద్యోగులకు సంవత్సరానికి రూ.8640 పెరగనుంది. అదే బేసిక్ శాలరీ రూ.56900 ఉంటే, 42 శాతానికి డీఏ లెక్కిస్తూ రూ.23898 గా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న డీఏ ప్రకారం లెక్కిస్తే రూ.21622 గా ఉంది. అంటే నెలకు రూ.2276 డీఏ పెరగనుంది. సంవత్సరానికి అదది రూ.27312 గా ఉండనుంది.