Dammaiguda Girl Murder : దమ్మాయిగూడ పాప హత్య కేసులో తండ్రి బయటపెట్టిన అసలు నిజాలు.. వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Dammaiguda Girl Murder : దమ్మాయిగూడ పాప హత్య కేసులో తండ్రి బయటపెట్టిన అసలు నిజాలు.. వీడియో

 Authored By kranthi | The Telugu News | Updated on :1 May 2023,9:00 pm

Dammaiguda Girl Murder : ఇటీవల దమ్మాయిగూడ పాప హత్య కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే కదా. ఆ అమ్మాయి ఇందు హత్య కేసులో ఆమె తండ్రి పలు సంచలన విషయాలు చెప్పారు. పోలీసులు మా పాప విషయంలో చాలా దారుణంగా ప్రవర్తించారని.. తను చనిపోయినప్పుడు కనీసం ముఖం కూడా చూడనివ్వలేదన్నారు ఆయన. స్కూల్ కు వెళ్లిన పాప మిస్ అయిన విషయం తెలిసిందే కదా. మిస్ అయిన పాప దమ్మాయిగూడ వద్ద ఉన్న చెరువులో పడి చనిపోయి ఉంది. చెరువులో ప్రమాదవశాత్తు పడి చనిపోయిందా? లేక హత్యా? అనేది ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు.

Dammaiguda School Girl Missing Incident: దమ్మాయిగూడ బాలిక మృతి..  పోస్టుమార్టంలో సంచలన విషయం.. మరణానికి అసలు కారణం ఇదీ! - OK Telugu

కానీ.. తమ కూతురును హత్య చేశారు అంటూ ఆ పాప తండ్రి చెబుతున్నారు. పాపను ఎలాగైనా వెతికిస్తాం అని చెప్పిన పోలీసులు పాప మృతదేహం చెరువులో ఉందని తెలిశాక కూడా తనకు చెప్పలేదన్నారు. చివరకు తన ముఖాన్ని కూడా చూడనివ్వలేదన్నారు. 10 ఏళ్ల ఇందు స్కూల్ నుంచి మిస్ అవడం ఏంది.. ఆ పాప.. బ్యాగ్ స్కూల్ లో ఉండి.. పాప కనిపించకుండా చివరకు చెరువులో శవంలా కనిపించడం ఏంటంటూ స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

dammaiguda girl indu father reveals facts about incident

dammaiguda girl indu father reveals facts about incident

Dammaiguda Girl Murder : చిచోర పోరగాళ్ల పనే అంటున్న స్థానికులు

చిన్నపిల్లలను కూడా వదలడం లేదు. చెరువు చుట్టూ చిచోర పోరగాళ్లు, గంజాయి తాగే అలవాటు ఉన్నవాళ్లు, మద్యం తాగే అలవాటు ఉన్నవాళ్లు ఉంటారు. అక్కడే తిరుగుతుంటారు. వాళ్లలో ఎవరైనా పాపపై అఘాయిత్యం చేయడమో లేక చంపి చెరువులో పడేసి ఉండటమో చేసి ఉంటారు అంటున్నారు స్థానికులు. అయితే.. పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తే మాత్రం ఊపిరితిత్తుల్లోకి నీళ్లు వెళ్లడం వల్లనే చనిపోయింది అంటున్నారు. ఈ ఘటన జరిగి 4 నెలలు అవుతున్నప్పటికీ ఇంకా ఆ పాప కేసు ఓ కొలిక్కి రాలేదు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది