Dates | చలికాలంలో ఖర్జూరాలు తింటే .. ఆరోగ్యానికి ఎన్ని అద్భుత ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
Dates | చలికాలం రాగానే శరీరానికి తగినంత వేడి, శక్తి అందించే ఆహారం అవసరం అవుతుంది. ఈ సీజన్‌లో ఖర్జూరాలు (Dates) తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో సహజ చక్కెరలు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉండటంతోపాటు శరీరాన్ని చల్లని వాతావరణానికి తగిన విధంగా రక్షిస్తాయి.
#image_title
శక్తిని అందించే సహజ ఫుడ్
ఖర్జూరాల్లో గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్ వంటి సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి తక్షణ శక్తిని అందించడంలో సహాయపడతాయి. చలికాలంలో రోజూ ఖర్జూరాలు తింటే అలసట, బలహీనత దూరమవుతాయి. అలాగే జలుబు, దగ్గు వంటి చిన్న ఇన్‌ఫెక్షన్లను కూడా నివారించవచ్చు. రాత్రిపూట వేడి పాలలో ఖర్జూరాలు వేసి తినడం మరింత మంచిది.
కండరాల నొప్పికి ఉపశమనం
ఖర్జూరాల్లో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది కండరాల నొప్పి, బలహీనతను తగ్గిస్తుంది. అలాగే విటమిన్ A కంటి చూపును మెరుగుపరుస్తుంది. రాత్రిపూట పాలలో ఖర్జూరాలు నానబెట్టి తింటే శరీరానికి అవసరమైన పోషకాలు సమతుల్యంగా అందుతాయి.
నిపుణుల సూచన
వైద్యుల సూచన ప్రకారం రోజుకు 2 నుండి 3 ఖర్జూరాలు తినడం సరిపోతుంది. వీటిలో సహజంగా చక్కెరలు ఉండటం వల్ల అదనంగా స్వీటెనర్ జోడించాల్సిన అవసరం లేదు.
మధుమేహ రోగులు జాగ్రత్త!
ఖర్జూరాల్లో సహజ చక్కెరలు ఎక్కువగా ఉండటం వల్ల మధుమేహ రోగులు వీటిని అధికంగా తినకూడదు. అలెర్జీలు ఉన్నవారు లేదా చక్కెర సమస్యతో బాధపడుతున్నవారు ముందుగా వైద్యుడి సలహా తీసుకోవాలి.