Daughter : తండ్రిని అమ్మకానికి పెట్టిన కూతురు .. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు ..?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Daughter : తండ్రిని అమ్మకానికి పెట్టిన కూతురు .. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు ..??

 Authored By aruna | The Telugu News | Updated on :6 October 2023,1:00 pm

Daughter : టైటిల్ చూసి ఇదేదో సీరియస్ వార్త అనుకుంటారేమో. తల్లిదండ్రుల మీద కోపం వస్తే పిల్లలు తీర్చుకునే రివేంజ్ స్టోరీ అన్నమాట. పిల్లల్ని తల్లిదండ్రులు మందలించడం, పిల్లలు వారిపై అలగటం చాలా కామన్. అలాగే తండ్రి కూతురికి విభేదాలు వచ్చాయి.ఆ కూతురు తన తండ్రి పై తీసుకున్న రివేంజ్ చదివితే నవ్వు వస్తుంది. ఆమె తన ఫాదర్ ఆన్ సేల్ అని నోటీసును తన ఇంటి ముందు కిటికీ అతికించింది. అంతేకాకుండా తన తండ్రిని రెండు లక్షలకు అమ్ముతున్నట్లు నోటీసులో రాసింది.

మెలన్ కో హాలిక్ అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన ఈ ఫోటో వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ పై నెటిజన్లు స్పందించారు. ఈ ఫోటో చూసాక మీ బిడ్డ మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్నట్లు భావిస్తున్నామని, కొందరు ఆమెకు మీరంటే చాలా ప్రేమ అని, ఆమెను ఎప్పుడూ ఇలా చెడ్డగానే ఉండనివ్వండి అని మరి కొందరు రిప్లై చేశారు. పిల్లలు తెలియక చేసిన చిలిపి పనులు ఒక్కోసారి వినోదాన్ని కలిగిస్తుంటాయి. తండ్రితో గొడవ పడితే ఇలా స్వీట్ గా రివేంజ్ తీర్చుకోవచ్చని ఈ ఫన్నీ పోస్ట్ చూస్తే అర్థమవుతుంది.

Daughter cute revenge on her father

Daughter cute revenge on her father

దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ న్యూస్ పై నెటిజన్స్ తమదైన శైలిలో స్పందిస్తూ తండ్రీ కూతుర్ల మధ్య ఉన్న ప్రేమను తెలియజేస్తున్నారు. తండ్రి కూతుర్ల మధ్య ప్రేమ ఇలానే ఉంటుందేమో అని కొందరు కామెంట్లు చేశారు. కూతురి రివేంజ్ భలే క్యూట్ గా ఉంది అంటూ మరికొందరు కామెంట్లు చేశారు. తన తండ్రి పై రివేంజ్ తీర్చుకోవడానికి ఇలా చేసిందా అని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది