Father : అక్రమ సంబంధం కేసు .. వామ్మో రాజమౌళి సినిమాలో కూడా ఇలాంటి ట్విస్ట్ లు ఉండవు
ప్రధానాంశాలు:
తండ్రి అని కూడా ఆలోచించకుండా హత్య చేసిన కూతురు
Father : అక్రమ సంబంధం కేసు .. వామ్మో రాజమౌళి సినిమాలో కూడా ఇలాంటి ట్విస్ట్ లు ఉండవు..!
Father : ఏ తండ్రైన తన పిల్లల కోసం కాయ కష్టం చేసి, ఎలాంటి ఇబ్బందులు రానివ్వకుండా కాపాడతాడు. అయితే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఘట్‌కేసర్ పరిధిలో జరిగిన ఘటన ఈ భావనను తుడిచిపెట్టేసింది. లింగం అనే వ్యక్తిని అతని కన్న కూతురు మనిషా తన తల్లి శారద, ప్రియుడు జావిద్‌ల సహాయంతో హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. లింగం శవం ఎదులాబాద్ చెరువులో తేలడంతో పోలీసుల దర్యాప్తు ప్రారంభించగా..దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి.

Father : అక్రమ సంబంధం కేసు .. వామ్మో రాజమౌళి సినిమాలో కూడా ఇలాంటి ట్విస్ట్ లు ఉండవు
Father : అక్రమ సంబంధానికి అడ్డు తగులుతున్నాడని తండ్రినే చంపేసిన కూతురు
తండ్రి లింగం తన కూతురు మనిషా సాగిస్తున్న వివాహేతర సంబంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించేవాడు. అతడి బిడ్డ భవిష్యత్తు చెడిపోతుందన్న ఆందోళనతో పలుమార్లు మందలించేవాడు. తండ్రి మందలింపును తట్టుకోలేకపోయినమనీషా.. తల్లి శారద , ప్రియుడు జావిద్‌ను సాయం తీసుకోని తండ్రిని చంపేందుకు ప్లాన్ చేసింది. నిద్ర మాత్రలు ఇచ్చి స్పృహ కోల్పోయిన లింగాన్ని దిండు ఉంచి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. తర్వాత మృతదేహాన్ని చెరువులో పడేసి వెళ్లారు. ఈ విషయాన్నీ పోలీసుల విచారణలో తెలిపారు.
ఈ సంఘటన ఒకవైపు హృదయాన్ని కలచివేస్తే, మరోవైపు సమాజంలోని నైతిక పతనాన్ని చూపుతోంది. ఓ తండ్రి చేతిలోనే తన కూతురు ప్రాణాలు తీసే దాకా సమాజం దిగజారిందంటే, పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పెరిగిపోతున్న వివాహేతర సంబంధాల వల్ల కుటుంబాలే కాదు, ప్రాణాల మీదకు కూడా వస్తున్నాయి. ఈ సంఘటనలు మనకు హెచ్చరికగా మారాలి. సంబంధాలలో నైతికత, బాధ్యత, విలువలు లేకపోతే కుటుంబాలే కాదు, సమాజం మొత్తం అస్థిరతకు గురవుతుందనేది ఈ దారుణ ఘటన చెప్పకనే చెపుతుంది.