Deepika | కల్కి 2 నుంచి దీపికా ఔట్‌.. మ‌రి బిడ్డ‌ని ఎవ‌రు కంటారంటూ కొత్త ప్ర‌శ్న‌లు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Deepika | కల్కి 2 నుంచి దీపికా ఔట్‌.. మ‌రి బిడ్డ‌ని ఎవ‌రు కంటారంటూ కొత్త ప్ర‌శ్న‌లు

 Authored By sandeep | The Telugu News | Updated on :19 September 2025,4:00 pm

Deepika | నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన విప్లవాత్మక సై-ఫై చిత్రం ‘కల్కి 2898 AD’ ఘనవిజయం సాధించింది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె లాంటి స్టార్ నటులతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందింది. అయితే ఈ విజయం తర్వాత ఎంతో కీలకమైన ‘కల్కి’ సీక్వెల్ పై ఆసక్తి పెరిగింది. తాజాగా ఈ సీక్వెల్‌కు సంబంధించి షాకింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. దీపికా పదుకొణెను ‘కల్కి 2’ నుంచి తప్పించినట్టు తెలుస్తోంది.

#image_title

ఆ స్థానంలో ఎవ‌రు?

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, దీపికా ప్రాజెక్ట్‌లో చేరిన తర్వాత అనవసరమైన డిమాండ్లు మొదలుపెట్టారట. రెమ్యునరేషన్ పెంపు, పెద్ద పర్సనల్ టీమ్, షూటింగ్‌కు సంబంధించిన కొన్ని అసౌకర్యకరమైన డిమాండ్లు చేస్తుండడంతో, దర్శకుడు నాగ్ అశ్విన్ మరియు మేకర్స్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారని చెబుతున్నారు.

ఈ కీలక సమయంలో మేకర్స్ ముందున్న పెద్ద టాస్క్ – దీపికా స్థానాన్ని భర్తీ చేయడం. ఈ పాత్ర కథలో చాలా బలంగా ఉండటంతో, ఆ ఇమేజ్‌కు సరిపడే హీరోయిన్ ఎంపిక చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఈ రోల్ కోసం రెండు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అనుష్క శెట్టి… ‘కల్కి 2’లోని సుమతి పాత్రకు ఆమె కరెక్ట్ ఫిట్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. గ్లోబల్ లెవెల్లో ఫేమ్ ఉన్న ప్రియాంకా, హాలీవుడ్ అనుభవంతో కలిపి సినిమాకు ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్రాండ్ వ్యాల్యూ పెంచగలదు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది