Prabhas : జపాన్ లో మాట్లాడి షాక్ ఇచ్చిన ప్రభాస్.. జపాన్ ఫ్యాన్స్ కి స్పెషల్ మెసేజ్ వీడియో..!
ప్రధానాంశాలు:
Prabhas : జపాన్ లో మాట్లాడి షాక్ ఇచ్చిన ప్రభాస్.. జపాన్ ఫ్యాన్స్ కి స్పెషల్ మెసేజ్..!
Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ జపాన్ లో మాట్లాడాడు.. అక్కడ తన ఫ్యాన్స్ ని ప్రేక్షకులను విష్ చేస్తూ ప్రభాస్ తన స్పెషల్ మెసేజ్ పాస్ చెశాడు. అసలు ప్రభాస్ ఎందుకు జపాన్ లో మాట్లాడాడు. అక్కడ ఫ్యాన్స్ ని ఉద్దేశించి ఎందుకు మెసేజ్ ఇచ్చాడు అంటే ప్రభాస్ నటించిన కల్కి సినిమా జనవరి 3న జపాన్ లో భారీగా రిలీజ్ అవుతుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జపాన్ రిలీజ్ సందర్భంగా ప్రభాస్ అక్కడ ఫ్యాన్స్ ని ఉద్దేశిస్తూ మాట్లాడాడు. హలో జపాన్ ఫ్యాన్స్ అంటూ జపాన్ భాషలో మాట్లాడాడు ప్రభాస్. తనను ఇంతగా ఆదరిస్తున్న ఫ్యాన్స్ కి ధన్యవాదాలు తెలుపుతూ కల్కి 2898 ఏడి వస్తుంది. దాన్ని కూడా మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నా అన్నారు. జనవరి 3న రిలీజ్ అవబోతున్న కల్కి సినిమా చూసి ఆదరించాలని అన్నాడు. త్వరలోనే మీ దగ్గరకు వచ్చి కలుస్తానని అన్నాడు ప్రభాస్.
Prabhas ప్రభాస్ మినహా కల్కి టీం..
ప్రభాస్ కి ఈమధ్యనే షూటింగ్ లో కాలు బెనికిందని తెలిసిందే. అందుకే జపాన్ వెళ్లలేకపోతున్నాడు. ఐతే ప్రభాస్ మినహా కల్కి టీం జపాన్ వెళ్లి అక్కడ ప్రమోషన్స్ చేయనుంది. ఐతే ప్రభాస్ వెళ్తాడా లేదా అన్నది తర్వాత తెలుస్తుంది. ప్రభాస్ కల్కి సినిమా జనవరి 3న రిలీజ్ అవుతుండగా అందుకు తగినట్టుగానే జపాన్ లో సినిమా ప్రమోషన్స్ భారీగా ప్లాన్ చేస్తున్నారు.
ప్రభాస్ కల్కి సినిమాలో అమితాబ్, కమల్ హాసన్ నటించారు. దీపిక పదుకొనె కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటించింది. కల్కి 1 సినిమా రిలీజైన మొదటిసారి 1100 కోట్ల పైన కలెక్ట్ చేసింది. ఐతే జపాన్ లో ఈ సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం కచ్చితంగా సినిమా మరింత కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. RRR తర్వాత తెలుగు సినిమా కల్కి జపాన్ లో భారీగా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా అక్కడ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. Prabhas, Kalki 2898 AD, Kalki, Nag Aswin ,
This time, I couldn’t come to Japan.. Sorry fans.. – Rebel Satr #Prabhas #Kalki2898ADinJapan, in cinemas across Japan from January 3rd!@SrBachchan @ikamalhaasan @deepikapadukone @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD #Kalki2898AD #TeluguFilmNagar pic.twitter.com/KviuROKIH7
— Telugu FilmNagar (@telugufilmnagar) December 18, 2024