Arvind Kejriwal : బ్రేకింగ్.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కరోనా… ఐసోలేషన్‌లో కేజ్రీవాల్..!
Arvind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోవిడ్ బారిన పడ్డారు. గత కొద్ది రోజులుగా స్వల్ప కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆయన.. వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందులో పాజిటీవ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని కేజ్రీవాల్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. స్వల్ప లక్షణాలే ఉన్నాయంటూ ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.
వైద్యుల పర్యవేక్షణలో హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. గత వారం రోజులుగా తనను కలిసిన మిత్రులు, శ్రేయోభిలాషులందరూ దయ చేసి కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. మహమ్మారి పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. తమ ప్రియతమ నాయకుడు మహమ్మారి బారి నుంచి త్వరగా కోలుకోవాలని ఆప్ పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. అప్పుడే సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున సందేశాలను పోస్ట్ చేస్తున్నారు.

Delhi CM Arvind Kejriwal tested COVID positive
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. గత పది రోజులుగా రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురిచేస్తుండగా.. పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, రాజకీయ నేతలు వైరస్ బారిన పడుతున్నారు.