CM KCR : సీఎం కేసీఆర్‌ని ఆరువేల పెన్షన్ డిమాండ్ చేసిన బట్టతల బాధిత తొలి సంఘం అధ్యక్షుడు..!!
CM KCR : ప్రస్తుత రోజుల్లో మగవారు అత్యధికంగా ఎదుర్కొంటున్న సమస్యలలో బట్టతల ఒకటి. కారణాలు లేకుండానే 30 సంవత్సరాలు రాకముందే చాలా మంది బట్టతల బారిన పడుతున్నారు. దీంతో పెళ్లిళ్లు అవ్వలేక… వయసు పెద్దగా కనబడుతూ ఉండటంతో సమాజంలో తిరగడానికి కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి బట్టదల సంఘం మొదటి అధ్యక్షుడిగా వెల్ది బాలయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బట్టతల బాధితులకు ₹6000 పింఛన్ ఇవ్వాలని కోరారు. సమాజంలో బట్టతల బాధ్యతలు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నారని మానసిక వికలాంగుల క్రింద బట్ట తల బాధితులకు సంక్రాంతి పండుగలోపు పెన్షన్ అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. లేనిపక్షంలో బట్టతల బాధితుల జిల్లా సంఘం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని…
అలాగే ప్రగతి భవన్ ముట్టడి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బట్టతల బాధితులు… తదితరులు పాల్గొన్నారు. గురువారం మండలంలోని తంగళ్ళపల్లి రేణుక ఎల్లమ్మ దేవాలయం ఆవరణలో బట్టతల బాధితుల సమావేశాన్ని ఏర్పాటు చేసి నూతన వర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏకగ్రీవంగా ఎన్నికైన బట్టతల సంఘం అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక ఇదే సమయంలో ప్రధాన కార్యదర్శిగా రాజేషం, కోశాధికారిగా మౌటం రాము సభ్యులుగా పిల్లి నరసయ్యలు ఎన్నికయ్యారు.