Vijaywada | 5 రోజుల్లో భారీ ఆదాయం.. భక్తులందరికీ ఉచిత దర్శనాలు5 రోజుల్లో భారీ ఆదాయం.. భక్తులందరికీ ఉచిత దర్శనాలు
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చే నవరాత్రి ఉత్సవాల్లో, దేవస్థానం అధికారులు భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకున్నారు. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు, అన్ని రకాల దర్శన టికెట్లను తాత్కాలికంగా నిలిపివేసి, ఉచిత దర్శనమే అందుబాటులో ఉంచారు. ఈ విషయాన్ని దుర్గగుడి ఈవో శీనా నాయక్ తెలిపారు.

#image_title
భారీగా భక్తులు..
అలాగే, నిర్దేశిత సమయాల్లో మాత్రమే VIP దర్శనాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని పాటించకపోతే సామాన్య భక్తులకు భాదలు తప్పవని, అందువల్ల ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు తమ సమయంలోనే దర్శనానికి రావాలని సూచించారు.శరన్నవరాత్రుల ఐదవ రోజు అయిన సెప్టెంబర్ 26వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు దేవస్థానం రూ.28,21,637 ఆదాయం ఆర్జించింది.
అందులో 15 రూపాయల లడ్డూల విక్రయం: 19,121 లడ్డూలతో రూ.2,86,815, 100 రూపాయల లడ్డు బాక్స్‌లు: 23,581 బాక్స్‌ల విక్రయంతో రూ.23,58,100, పరోక్ష కుంకుమార్చనలు: రూ.20,000, పరోక్ష చండిహోమం: రూ.4,000, శ్రీచక్రార్చన: రూ.6,000, ఖడ్గమాలార్చన: రూ.35,812, ఫోటోలు, క్యాలెండర్ల విక్రయం: రూ.4,890, కేశఖండన: రూ.1,01,520, ఇతర ఆదాయం: రూ.4,500.. ఈ రోజుతో భక్తుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదైంది. సాయంత్రం 6 గంటల సమయానికి 90,006 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని, రాత్రి 12 గంటల వరకు దర్శనాలు కొనసాగే నేపథ్యంలో ఈ సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు తెలిపారు.