Viral Video : అదృష్టం అంటే ఇదేనేమో ధనలక్ష్మి ఇచ్చిపడేసింది… బెడ్ పై ఉన్న వ్యక్తికి 45 కోట్లు వీడియో వైరల్..!!
Viral Video : ప్రస్తుత సమాజంలో పరిస్థితులు ఒక్కొక్కరికి ఒకరకంగా ఎదురవుతున్నాయి. ఓవర్ నైట్ లోనే చాలామంది తలరాతలు మారిపోతున్నాయి. వ్యక్తుల జీవితాలు మాత్రమే కాదు దేశాల తలరాతలు కూడా క్షణం క్షణానికి మారిపోతున్నాయి. కొన్ని దేశాలు ఆకలి మంటలతో అలమటిస్తుంటే మరికొన్ని దేశాలు విలాసవంతంగా ముందుకు సాగుతున్నాయి. ఈ రకంగానే బెంగళూరుకి చెందిన అరుణ్ అనే వ్యక్తి ఒక్క రాత్రిలోనే 45 కోట్ల రూపాయలతో కోటీశ్వరుడు అయిపోయాడు. ఇతను దుబాయిలో పనిచేయడానికి వెళ్లడం జరిగింది. అరుణ్ కి మొదటి నుండి లాటరీలు కొన్ని అలవాటు ఉంది. అలా అని ఏది పడితే ఆ రకంగా కాకుండా చాలా ఆలోచించి లాటరీ టికెట్ కొనుగోలు చేయటం మనోడి టాలెంట్.
అయితే అనుకోకుండా మనోడు కొన్న మూడో లాటరీ టికెట్ బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఏకంగా 45 కోట్ల రూపాయలు గెలవడం జరిగింది. ఈ క్రమంలో లాటరీ గెలవడంతో.. నిర్వాహకులు అరుణ్ కి మొదట ఫోన్ కాల్ చేయగా.. అంతా ట్రాష్ అని.. మోసం చేయడానికి ఫోన్ కాల్ చేస్తున్నట్లు భావించాడు. కానీ సదరు నెంబర్ నుండి ఫోన్స్ భయంకరంగా రావడంతో బ్లాక్ లో పెట్టడం జరిగింది. అయినా గాని ఆ దుబాయ్ లాటరీ టికెట్ నిర్వహకులు పదేపదే అరుణ్ కి ఫోన్ చేయటంతో.. తన లాటరీ టికెట్ ఇంటర్నెట్లో చెక్ చేసుకోగా నిజంగానే గెలిచినట్లు తన నెంబర్ గుర్తించటంతో ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. లాటరీ టికెట్ గెలిచిన సమయంలో ..
అరుణ్ మోకాలు ఆపరేషన్ చేయించుకునీ హాస్పిటల్ లో ఉన్నాడు. ఇటువంటి పరిస్థితులలో లాటరీ అది కూడా ఏకంగా 45 కోట్ల రూపాయలు రావటంతో ఉబ్బితప్పిపోయి.. భగవంతుడు కరుణ చూపాడు అని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. వచ్చిన డబ్బులతో ఇంకా ఎవరి దగ్గర పనిచేయకుండా సొంతంగా వ్యాపారం స్టార్ట్ చేయబోతున్నట్లు.. అరుణ్ తెలియజేయడం జరిగింది. ఓవర్ నైట్ లో అది కూడా ఫోన్ కాల్ బ్లాక్ చేసి.. దుబాయ్ లాటరీ నిర్వాహకులు అరుణ్ వెంటపడి మరి డబ్బులు అందించడం.. ధనలక్ష్మి ఇచ్చిపడేసింది మనోడిని కోటీశ్వరుడు చేసిందనీ తాజా వార్త పై నేటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.