Dharmana Prasada Rao : శభాష్ ధర్మాన ప్రసాదరావు.. అద్భుతమైన నిర్ణయం
Dharmana Prasada Rao : ధర్మాన ప్రసాదరావు తెలుసు కదా. ఆయన వైసీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత. ఆయనకు రెండోసారి జరిగిన మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి వచ్చింది. అయినా కూడా తాను తన మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు రెడీగా ఉన్నానని చెప్పుకొచ్చారు. సీఎం జగన్ అనుమతిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఉద్యమంలోని వెళ్లాలని ఉందని ఆయన ఈసందర్భంగా చెప్పారు. విశాఖలో పరిపాలన రాజధాని కోసం ప్రతి ఒక్కరు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఉద్యమంలోకి వెళ్తే తనతో పాటు కొన్ని లక్షల మంది వస్తారని ఆయన చెప్పారు.
నిజానికి తొలి విడత మంత్రివర్గంలో ధర్మాన ప్రసాదరావుకు మంత్రి పదవిని ఇవ్వలేదు సీఎం జగన్. కానీ.. ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ కు మంత్రి పదవి దక్కింది. అయితే.. ధర్మాన ప్రసాద్ రావు అప్పుడు కొన్నిరోజులు చిన్నబుచ్చుకున్నారు. పార్టీ కార్యక్రమాలలో అంతగా యాక్టివ్ గా ఉన్నది లేదు. కానీ.. రెండో సారి ఆయనకు మంత్రి పదవి దక్కడంతో మళ్లీ పార్టీలో యాక్టివ్ అయ్యారు. ఇప్పుడు సీఎం జగన్ అనుమతిస్తే ఏకంగా రాజీనామా చేసేందుకు కూడా వెనుకాడటం లేదు ఆయన.

Dharmana Prasada Rao is ready to resign his minister post
Dharmana Prasada Rao : మంత్రి పదవి వదిలేసి విశాఖ రాజధాని ఉద్యమంలోకి ఎందుకు వెళ్తున్నారు?
అప్పుడేమో మంత్రి పదవి కావాలని తపించిన ధర్మాన.. ఇప్పుడు మంత్రి పదవికి రాజీనామా చేసి ఎందుకు మళ్లీ ఉద్యమంలోకి వెళ్లాలనుకుంటున్నారో తెలియదు కానీ.. ఉత్తరాంధ్రకు పరిపాలన రాజధాని రావడం కోసం తనువంతుగా ఈమాత్రం చేయాలని అనుకుంటున్నారు కావచ్చు. 2019 నుంచి చాలా రోజుల పాటు వైసీపీలో యాక్టివ్ గా లేని ధర్మాన ప్రసాద రావు.. ఇప్పుడు మంత్రి అయ్యాక ఉద్యమంలో పాల్గొంటా అని చెప్పడంతో ఉత్తరాంధ్ర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శభాష్ మంత్రి గారు.. ఇప్పటికి అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు అంటూ ప్రజలు అంటున్నారు.