Allu Arjun : నంద్యాలలో అల్లు అర్జున్.. వైసీపీ పార్టీ తరఫున ప్ర‌చారం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Allu Arjun : నంద్యాలలో అల్లు అర్జున్.. వైసీపీ పార్టీ తరఫున ప్ర‌చారం…!

Allu Arjun : ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆంధ్రప్రదేశ్ లో సినీ గ్లామర్ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం అలాగే కూటమి కోసం పలువురు సినీ ప్రముఖులు ప్రచారాలు చేస్తూ వస్తున్నారు. మరోవైపు అధికార పార్టీ వైసీపీ తరఫున కూడా పలువురు సినీ ప్రముఖులు ప్రచారాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఎవరు ఊహించని విధంగా నంద్యాల ఎన్నికల ప్రచారాలలో టాలీవుడ్ స్టార్ హీరో స్టైలిష్ స్టార్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :11 May 2024,9:15 pm

Allu Arjun : ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆంధ్రప్రదేశ్ లో సినీ గ్లామర్ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం అలాగే కూటమి కోసం పలువురు సినీ ప్రముఖులు ప్రచారాలు చేస్తూ వస్తున్నారు. మరోవైపు అధికార పార్టీ వైసీపీ తరఫున కూడా పలువురు సినీ ప్రముఖులు ప్రచారాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఎవరు ఊహించని విధంగా నంద్యాల ఎన్నికల ప్రచారాలలో టాలీవుడ్ స్టార్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సడన్ గా ఎంట్రీ ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోసం ఇటీవల అల్లు అర్జున్ స్వయంగా రంగంలోకి దిగారు. నంద్యాల నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు ప్రకటిస్తూ బన్నీ ప్రచారాలు నిర్వహించారు. నంద్యాల ప్రజలందరూ రవిచంద్ర రెడ్డిని గెలిపించాల్సిందిగా కోరుతూ ఓటర్లకు పిలుపునిచ్చారు.

అలాగే బన్నీతో పాటు ఆయన సతీమణి స్నేహారెడ్డి కూడా రవిచంద్ర రెడ్డి ఇంటికి వెళ్లారు. అయితే నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి అల్లు అర్జున్ కి అత్యంత సన్నిహితుడు. ఇక వారిద్దరి మధ్య ఉన్న సానుకూలత నేపథ్యంలోనే బన్నీ ప్రచారాలకు వచ్చినట్లుగా తెలుస్తుంది. అంతేకాక 2019 ఎన్నికల్లో కూడా రవిచంద్ర రెడ్డికి బన్నీ బెస్ట్ విషెస్ తెలియజేశారు. అయితే బన్నీ నంద్యాల వస్తున్నారని రాకను ముందుగానే తెలుసుకున్న ఆయన అభిమానులు పెద్ద ఎత్తున శిల్పా రవిచంద్ర కిషోర్ ఇంటికి తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా అభిమానులతో నిండిపోయింది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఇంటి నుంచి బయటకు వచ్చి అభిమానులకు నమస్కారాలు తెలియజేశారు. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Allu Arjun నంద్యాలలో అల్లు అర్జున్ వైసీపీ పార్టీ తరఫున ప్ర‌చారం

Allu Arjun : నంద్యాలలో అల్లు అర్జున్.. వైసీపీ పార్టీ తరఫున ప్ర‌చారం…!

Allu Arjun నా ప్రేమ మద్దతు పవన్ కళ్యాణ్ కే..

ఇదిలా ఉండగా మరోవైపు పవన్ కళ్యాణ్ యొక్క ఎన్నికల ప్రయాణం విజయవంతంగా సాగాలని కోరుకుంటూ బన్నీ సోషల్ మీడియా వేదికగా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ ఎంచుకున్న మార్గం , ప్రజలకు సేవ చేయాలి అన్న నిబద్ధతను ఎంతో గౌరవిస్తున్నానని పేర్కొన్నారు. ఒక ఫ్యామిలీ మెంబర్ గా నా ప్రేమ మద్దతు ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ కు ఉంటాయని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆశలు ఆశయాలు నెరవేరాలని కోరుకుంటున్నానని బన్నీ తన పోస్టులో రాసుకోచ్చారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది