Vemireddy Prabhakar Reddy : 24hrsలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బ్యాక్ టూ వైసీపీ ?? జగన్ చాణిక్యం!
ప్రధానాంశాలు:
Vemireddy Prabhakar reddy : 24hrsలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బ్యాక్ టూ వైసీపీ ?? జగన్ చాణిక్యం!
Vemireddy Prabhakar reddy : గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో జరిగిన మెయిన్ ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీకి ఒక్క డివిజన్ ఓటు కూడా రాలేదు. అన్ని వైసీపీ పార్టీనే కొట్టేసింది. కానీ ప్రస్తుతం నెల్లూరులో టీడీపి పుంజుకుంది. వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు ఇలా చాలామంది బయటికి వెళ్లారు. దీంతో తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చింది. ఇక ఇక్కడున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దంపతులు మామూలు నాయకులు కాదు. ఒక జిల్లాని శాసించగలిగే వాళ్లు. అలాంటి వాళ్లే వైసీపీ నుంచి బయటికి వచ్చారు. వీళ్ళ తర్వాత మేకపాటి, ఆనంద్ కుటుంబం ఇలా ఒకరి తర్వాత ఒకరు వైసీపీ పార్టీని వీడారు. దీంతో రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వైసీపీని క్లీన్ స్వీప్ గా ఓడిస్తుంది అని అంటున్నారు…
దీంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నెల్లూరు పెద్ద టెన్షన్ గా మారింది. దీనిపై వైయస్ జగన్ నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. గతంలో నెల్లూరులో టీడీపీ ని క్లీన్ స్వీప్ గా ఓడించిన తమ పార్టీ ఇప్పుడు ఇలా అయిపోవడం ఏంటని వైయస్ జగన్ చాణక్య స్ట్రాటజీతో మళ్లీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పార్టీలోకి తీసుకురావడానికి తనదైన శైలిలో ప్లాన్ చేస్తున్నారు. పార్టీ నుంచి ఎవరు వెళ్లిన బాధపడని వైయస్ జగన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన భార్య వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వెళ్లిపోవడంతో బాధపడుతున్నారు. నెల్లూరు జిల్లాలో ఎవరికి ఇవ్వని పదవులను ఇస్తే వారు పార్టీని వీడారని జగన్ ఆందోళన చెందుతున్నారు. టీడీపీ పెట్టిన అంశాల కంటే ఎక్కువ అంశాలతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని 24 గంటల్లో మళ్లీ వైసీపీలోకి తీసుకురావాలని వైయస్ జగన్ ప్లాన్ చేస్తున్నారు.
రాయబారానికి వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డిని నెల్లూరుకు పంపించనున్నారని తెలుస్తుంది. అయితే ఇది వర్క్ అవుట్ అవుతుందా లేదా అనేది పెద్ద ప్రశ్న. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు నుంచి ఎంపీగా పోటీ చేయమని, ఆ పార్లమెంట్ కింద ఉన్న ఐదు నియోజకవర్గాలను ఐదుగురు ఎమ్మెల్యేల విషయంలో ఇద్దరం కలిసి నిర్ణయం తీసుకుందామని బంపర్ ఆఫర్ ను వైయస్ జగన్ వేమిరెడ్డికి ఇస్తున్నారని తెలుస్తుంది. ఈ ఆఫర్ ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి రాయబారంగా పంపించినట్లు తెలుస్తుంది. అయితే ఇది వర్క్ అవుట్ అయితే 24 గంటల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి లోకి వచ్చే అవకాశం ఉంది. ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహచరులు, జిల్లా కార్యకర్తలు కూడా మళ్లీ వైసీపీలోకి రమ్మని కోరుతున్నారు. దీంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 24 గంటల్లో వైసీపీ లోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.