Dhee Yash Master : ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు…. ‘ఢీ’ యశ్ మాస్టర్‌కు తీరని కష్టం..!
Dhee Yash Master : ఢీ షో ద్వారా ఫేమస్ అయిన డ్యాన్స్ మాస్టర్లు ఎంతో మంది ఉన్నారు. కానీ ఈ మధ్య కాలంలో యశ్ మాస్టర్ పేరు మరింత ఎక్కువగా వినిసిస్తోంది. ఢీ షోలో విన్నర్ అయిన యశ్ మాస్టర్.. డ్యాన్స్ ప్లస్ షోలో జడ్జ్‌గా దుమ్ములేపేశాడు. ఇక ఢీ షోలో ఆయన ప్రతిభను గమనించిన సెలెబ్రిటీలు సినీ అవకాశాలు ఇచ్చారు. ఏకంగా సమంతతో కొత్త కొత్త స్టెప్పులు వేయించి ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు ఆయన పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా ఆయన షేర్ చేసిన వీడియో మాత్రం అందరినీ కదిలిస్తోంది.
‘ఢీ’ యశ్ మాస్టర్‌కు తీరని కష్టం – Dhee Yash Master
తన అసిస్టెంట్ కేవల్‌కు బ్లడ్ క్యాన్సర్ అంటూ అసలు సంగతిని చెప్పేశాడు. ‘ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నా అసిస్టెంట్ కేవల్ మీ అందరికీ తెలుసు. అతను ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఇప్పుడు అతడికి వేలూరులోని సీఎంసీ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. అయితే ఇప్పుడు అర్జెంట్ పన్నెండు మంది బ్లడ్ ఇవ్వాల్సి ఉంది.దాని కోసం ఇక్కడి నుంచి మేం బయల్దేరుతున్నాం. కానీ తిరుపతి, చెన్నై, బెంగూళరు ఇలా అక్కడ దగ్గర్లో ఉన్న వారు ఎవరైనా సాయం చేయండి. వెళ్లి రక్తాన్ని ఇవ్వండి. మీకు మిగతా సమాచారాన్ని చెబుతాను. ఇక్కడ ఫోన్ నంబర్ కూడా ఇస్తాను. ప్లీజ్ అతని కోసం ప్రార్థించండి’ అని యశ్ మాస్టర్ వీడియో ద్వారా తన బాధను బయటకు చెప్పేశారు.
View this post on Instagram