Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ను ఆలా అని ఎమ్మెల్సీ కవిత తప్పు చేసిందా..?
Pawan Kalyan : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన తాజా వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఆమె చేసిన “అన్‌ఫార్చునేట్లీ హీ బికేం ఎ డిప్యూటీ సీఎం”, “హీ ఈజ్ నాట్ ఎ సీరియస్ పొలిటిషియన్” అనే వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలు పవన్ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. సోషల్ మీడియాలో ఆమెను ట్రోలింగ్ చేస్తూ జనసేన అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
కవిత వ్యాఖ్యలపై స్పందించిన జనసైనికులు ఆమె గత విషయాలను సోషల్ మీడియాలో తెరపైకి తీసుకొచ్చారు. ప్రత్యేకంగా దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమెపై వచ్చిన ఆరోపణలు, అరెస్ట్ వీడియోలు వైరల్ చేస్తున్నారు. “సీరియస్ పొలిటిషియన్ అంటే స్కాముల్లో పడ్డవాళ్లా?” అంటూ సెటైర్లు వేస్తున్నారు. కవిత చేసిన స్కామ్ వల్లే తెలంగాణలో బీఆర్ఎస్, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయాయని విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ను ఆలా అని ఎమ్మెల్సీ కవిత తప్పు చేసిందా..?
కేవలం వారసత్వ రాజకీయాలతో రాజకీయాల్లో కొనసాగుతున్న కవితకి, ప్రజాధారణతో పదవికి వచ్చిన పవన్‌ను తగ్గించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇక నెటిజన్లతో పాటు పలు రాజకీయ వర్గాలు కూడా కవిత వ్యాఖ్యలు సరైనవుకాదని అభిప్రాయపడుతున్నాయి. పొరుగు రాష్ట్ర నాయకుడిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం రాజకీయ మర్యాదలకు విరుద్ధమని విమర్శిస్తున్నారు. ఒకవేళ కవితకు పవన్ పని తీరు నచ్చకపోయినా, అతని స్థాయి పై వ్యాఖ్య చేయడం అనవసరమని అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా కవిత చేసిన వ్యాఖ్యలతో ఆమె ఒకే ఒక్క మాటతో జనసేన అభిమానుల నిరసనను మేల్కొలిపినట్లయింది.