Renu Desai : జనసేన పార్టీలోకి రేణు దేశాయ్? పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ చేశాడా? సోషల్ మీడియాలో న్యూస్ వైరల్
Renu Desai : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త తెగ హల్ చల్ చేస్తోంది. వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆ విషయం గురించే చర్చ. అదే జనసేన పార్టీకి సంబంధించిన న్యూస్. అది నిజమా.. అబద్ధమా అనేది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ Renu Desai .. జనసేన పార్టీలో చేరిందంటూ గత కొన్ని రోజుల నుంచి వార్తలు గుప్పుమంటున్నాయి. ఒకవేళ నిజంగానే రేణు దేశాయ్ జనసేన పార్టీలో చేరితే.. అది సీక్రెట్ గా ఉంచడం ఎందుకు. ఏ పార్టీలో చేరిన నాయకులు అయినా బహిరంగంగానే చెబుతారు కదా. అందరి ముందే పార్టీల్లో చేరుతారు కదా. మరి.. రేణు దేశాయ్ అంత సీక్రెట్ గా జనసేన పార్టీలో చేరాల్సిన అవసరం ఏం వచ్చింది అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.
అసలు నిజంగానే రేణు దేశాయ్ జనసేనలో చేరిందా? పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ చేస్తేనే జనసేనలో చేరిందంటూ వార్తలు వస్తుండటంతో అసలు వాస్తవాన్ని కనుక్కునే పనిలో పడ్డారు. నిజానికి ప్రస్తుతం రేణు దేశాయ్ కి, పవన్ కళ్యాణ్ కు అసలు సంబంధమే లేదు. ఎందుకంటే.. వాళ్లు విడాకులు తీసుకొని ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి చేసుకోగా.. రేణు దేశాయ్ కూడా రెండో పెళ్లి చేసుకుంది.
Renu Desai : పవన్ ను దెబ్బతీసేందుకే రేణు దేశాయ్ ని మధ్యలోకి లాగుతున్నారా?
అయితే.. ఇదంతా కావాలని రాజకీయంగా పవన్ కళ్యాణ్ ను దెబ్బతీసేందుకు వైసీపీ బ్యాచ్ ఆడుతున్న నాటకం అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే.. త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో కావాలని కొన్ని పార్టీల నేతలు రేణు దేశాయ్ జనసేనలో చేరుతోందంటూ, కొందరైతే చేరిందంటూ దుష్ప్రచారం చేస్తున్నారు అని తెలుస్తోంది. ఏది ఏమైనా.. అసలు తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే లేదని అప్పట్లో రేణు దేశాయ్ చెప్పిన విషయం తెలిసిందే. తను కేవలం సినిమాలు, సీరియల్స్ మాత్రమే చేస్తానని కూడా చెప్పుకొచ్చింది. అందుకే.. తను రాజకీయాల్లోకి వస్తుంది అంటే కూడా ఎవ్వరికీ నమ్మబుద్ధి కావడం లేదు.