Pawan Kalyan : ఒక్క మిస్టేక్ తో పవన్ కళ్యాణ్ కొంప ముంచేసిన చంద్రబాబు, జగన్ కి ఏనుగుల బలం..!
Pawan Kalyan : అన్ని రాజకీయాలందు ఏపీ రాజకీయాలు వేరు అని ఊరికే అనరు ఎందుకంటే.. ఏపీ రాజకీయాలు ఎప్పుడు ఎటువైపు ఎందుకు మళ్లుతాయో అర్థం కాదు. ఇవాళ ఉన్న రాజకీయాలు రేపు ఉండవు. ఒక్కోరోజు ఒక్కోలా ఉంటాయి. రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతుంటాయి. ప్రస్తుతం మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ప్రస్తుతం రాజకీయాలు వైసీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగా ఉన్నాయి. నిజానికి ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ. కానీ.. టీడీపీని వెనక్కి నెట్టి మరీ జనసేన పార్టీ ముందుకెళ్లి వైసీపీతో తాడో పేడో తేల్చుకుంటోంది.
అందుకే జనసేనకు ఒక్కసారిగా పవర్ వచ్చేసింది. అసలు జనసేనతో పొత్తు పెట్టుకోవాలని టీడీపీ చాలారోజుల నుంచి తహతహలాడుతోంది కానీ.. దాని వల్ల టీడీపీకి లాభం కంటే నష్టమే ఎక్కువ. ఎందుకంటే.. కొన్ని వర్గం ఓట్లు కలిసి వచ్చినా.. జనసేన వ్యతిరేక ఓట్లు టీడీపీకి అడ్డం కానున్నాయి. అంతే కాదు.. పవన్ కళ్యాణ్ టీడీపీని డామినేట్ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని కూడా చీల్చి చెండాడుతున్నారు. ప్రధాని ఏపీ పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్.. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. దీంతో ఏపీలో ఒక్కసారిగా పవన్ ఇమేజ్ పెరిగింది. అలాగే..
Pawan Kalyan : ప్రధానితో భేటీ అవడంతో పవన్ ఇమేజ్ పెరిగిందా?
బీజేపీతో జనసేన పార్టీ బంధం కూడా బలోపేతం అవుతుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ టీడీపీతో పొత్తు కుదిరితే.. తాను కొన్ని సీట్లు డిమాండ్ చేసే అవకాశం ఉందని, తాను డిమాండ్ చేసిన సీట్లను ఇస్తేనే టీడీపీతో పొత్తుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏది ఏమైనా.. పవన్ ఎంత బలపడితే.. అది వైసీపీకే లాభం అని.. అది వైసీపీకే మంచిదని వైసీపీ నేతలు కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే.. జనసేన బలపడితే ఆటోమెటిక్ గా టీడీపీ బలహీనపడినట్టే లెక్క. టీడీపీకి పట్టు ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ జనసేనకు భారీగా మద్దతు లభిస్తోంది. చూద్దాం మరి.. ఏపీలో పవన్ కళ్యాణ్ పార్టీ ఇంకెంత బలంగా మారనుందో?