TDP : టీడీపీకి పట్టిన నారా లోకేశ్ అనే వైరస్ కు ఉన్న ఒకే ఒక వ్యాక్సిన్ జూనియర్ ఎన్టీఆర్… అన్నది ఎవరో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TDP : టీడీపీకి పట్టిన నారా లోకేశ్ అనే వైరస్ కు ఉన్న ఒకే ఒక వ్యాక్సిన్ జూనియర్ ఎన్టీఆర్… అన్నది ఎవరో తెలుసా?

 Authored By jagadesh | The Telugu News | Updated on :21 April 2021,8:10 pm

TDP : ప్రస్తుతం ఏపీలో టీడీపీ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు. 2019 ఎన్నికల తర్వాత ఏపీలో టీడీపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటోంది. టీడీపీకి అసలు ఇటువంటి పరిస్థితి వస్తుందని ఎవ్వరూ కలలో కూడా ఊహించి ఉండరు. తెలుగుదేశం పార్టీ అంటేనే ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన పార్టీ. అంతెందుకు చాలా గ్యాప్ తర్వాత కూడా 2014 లో టీడీపీ ఏపీలో బంపర్ మెజారిటీతో గెలిచింది అంటే మామూలు విషయం కాదు. దాంతో ఇక టీడీపీ దశ తిరిగినట్టే అని అంతా భావించారు. కానీ… కేవలం 5 ఏళ్లలోనే పార్టీ పరిస్థితి అంతా తలకిందులైంది.

director ramgopal varma tweet on nara lokesh and junior ntr

director ramgopal varma tweet on nara lokesh and junior ntr

ప్రస్తుతం టీడీపీ బాగుపడాలంటే పార్టీలోకి కొత్త రక్తం రావాలి. కొత్త నాయకులు కావాలి. చంద్రబాబు ఐడియాలజీ పాతబడిపోయింది. నారా లోకేశ్ కు ఇంకా రాజకీయ పరిణతి రాలేదు. దీంతో టీడీపీని కాపాడే దిక్కు ఎవరు ఉన్నారు అని అంతా ఆలోచిస్తున్న నేపథ్యంలో… ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఓ విచిత్రమైన ట్వీట్ చేశారు.

నిజానికి… రామ్ గోపాల్ వర్మ ట్వీట్లను ఎవ్వరూ పట్టించుకోరు. ఆయన ట్వీట్లు కూడా అలాగే ఉంటాయి. కానీ.. ఆ ట్వీట్లలో నిగూఢార్థం అయితే దాగి ఉంటుంది. అది అర్థం చేసుకున్నవాళ్లకే అర్థం అవుతుంది. మిగితా వాళ్లు ఆయన ట్వీట్లును లైట్ తీసుకుంటారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ కు కరోనా రావడంతో.. ఆయనకు కరోనా వచ్చిందని దానిపై కూడా సెటైరికల్ ట్వీట్లు చేసి వార్తల్లో నిలిచిన రామ్ గోపాల్ వర్మ.. తాజాగా టీడీపీ మీద పడ్డారు.

ఏప్రిల్ 20న చంద్రబాబు బర్త్ డే కదా… ఈసందర్భంగా ఆయనకు బర్త్ డే విషెష్ చెబుతూ.. పనిలో పనిగా.. చంద్రబాబుపై, ఆయన కొడుకు లోకేశ్ పై కొన్ని సెటైరికల్ ట్వీట్లు వదిలాడు వర్మ. తెలుగుదేశం పార్టీకి నారా లోకేశ్ అనే చాలా డేంజరస్ వైరస్ సోకిందని… ఆ వైరస్ కు వ్యాక్సిన్ జూనియర్ ఎన్టీఆర్ అంటూ సంచలన ట్వీట్ చేశారు వర్మ. అంతే కాదు… టీడీపీ నేతలంతా స్మార్ట్ గా ఆలోచించి… వెంటనే జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యాక్సిన్ ను వేసుకోవాలని లేదంటే మీ చావు మీరు చస్తారు… ఇది నా సలహా అంటూ ట్వీట్ చేశారు వర్మ.

TDP : చంద్రబాబు, నారా లోకేశ్… ఈ రెండు వైరస్ లకు వ్యాక్సిన్ జూనియర్ ఎన్టీఆరే

ఆ ట్వీట్ తర్వాత మరో ట్వీట్ లో చంద్రబాబును కూడా ఇరికించారు వర్మ. చంద్రబాబు, నారా లోకేశ్.. ఈ ఇద్దరు కరోనా వైరస్ లకు.. ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆరే వ్యాక్సిన్ అని…. టీడీపీ వర్కర్స్ అంతా వినండి అంటూ మరో ట్వీట్ వదిలాడు వర్మ.

అలాగే.. చంద్రబాబుకు బర్త్ డే శుభాకాంక్షలు చెబుతూ… ఏపీ ఉన్నంత కాలం మీరు ఉంటారు… ఎందుకంటే.. ఏపీని, చంద్రబాబును విడదీయలేం.. అంటూ మరో ట్వీట్ చేశారు. చంద్రబాబు గారు.. నాకు ఏపీ మ్యాప్ తెలియదు. కానీ… మీ ఫేస్ మ్యాప్ అయితే నాకు బాగా గుర్తుంది. మన నేల మీద మీ ప్రభావం అంతుంది.. అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. అలాగే పనిలో పనిగా.. ప్రధాని మోదీ మీద కూడా ఓ సెటైరికల్ ట్వీట్ చేశారు వర్మ.

 

 

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి