Cool Drinks | గ్యాస్, అసిడిటీ సమస్యలకు కూల్ డ్రింక్స్ ముప్పే.. నిపుణుల హెచ్చరికలు తప్పనిసరి
Cool Drinks | భోజనం తర్వాత అసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు చాలా మందే ఉన్నారు. ఈ సమస్యల నుండి తక్షణ ఉపశమనం పొందాలనే ఉద్దేశంతో చాలామంది కూల్ డ్రింక్స్ లేదా సోడా వంటి పానీయాలను సేవిస్తూ ఉంటారు. అయితే నిపుణుల చెబుతున్న వివరాల ప్రకారం, ఇవి తాత్కాలిక ఉపశమనం కలిగించినా, దీర్ఘకాలికంగా శరీరానికి భారీ నష్టం కలిగించే అవకాశముందని స్పష్టం చేస్తున్నారు.
#image_title
కూల్ డ్రింక్స్ వల్ల అసలైన ముప్పేంటంటే..?
ఆమ్ల ఉత్పత్తి పెరుగుతుంది
కూల్ డ్రింక్స్ సేవించిన వెంటనే కడుపులో ఆమ్ల స్థాయిలు మరింత పెరుగుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇది అసిడిటీని నియంత్రించడంలో సహాయపడకుండా, ఇంకా పెంచే ప్రమాదం ఉంటుంది.
తాత్కాలిక రిలీఫ్ – దీర్ఘకాలిక నష్టం
సోడాలో గల బుడగలు కడుపు నుంచి గ్యాస్ బయటికి రావడాన్ని ప్రోత్సహించవచ్చు. ఇది తాత్కాలిక ఉపశమనంలా అనిపించినా, చక్కెర, కార్బొనేటెడ్ అసిడ్లు, రసాయనాల ప్రభావం శరీరాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తుంది.
కడుపు, కాలేయానికి ప్రమాదం
ఈ డ్రింక్స్‌లో ఉండే కృత్రిమ పదార్థాలు, అధిక చక్కెర మోతాదు వల్ల లివర్‌పై ప్రభావం, జీర్ణవ్యవస్థ బలహీనత, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
ఈ వ్యక్తులు తప్పనిసరిగా కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి
గ్యాస్ట్రిక్ అల్సర్ ఉన్నవారు
ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS) బాధితులు
మధుమేహం (Diabetes) ఉన్నవారు
అధిక బరువు లేదా స్థూలకాయం ఉన్నవారు
కాలేయ సంబంధిత వ్యాధులున్నవారు