train ట్రైన్ బోగీల మీద ఉండే గీతాలకు అర్ధం తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

train ట్రైన్ బోగీల మీద ఉండే గీతాలకు అర్ధం తెలుసా..?

 Authored By brahma | The Telugu News | Updated on :2 July 2021,5:05 pm

train రైలు ప్రయాణం ఇష్టపడని వాళ్లంటూ ఎవరు ఉండరు.. ఎందుకంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా, సుఖంగా సాగే ప్రయాణం అది. రోడ్డు ప్రయాణంతో పోల్చి చూస్తే రైలు ప్రయాణం ఎంతో హాయిగా ఉంటుంది. మనలో చాలా మంది ఇప్పటికే రైలు ప్రయాణం అనుభూతి పొందివుంటారు. ఎన్నో సార్లు రైళ్లు ఎక్కి వుంటారు. ఆ సమయంలో మన బోగి, మన బెర్త్ మాత్రమే చూసుకుంటాం కానీ ఇక వేరే విషయాలు గురించి పెద్దగా పట్టించుకోము… అయితే రైలు ప్రయాణంలో మనం తెలుసుకోవాల్సిన అనేక విషయాలు ఉంటాయి. ముఖ్యంగా రైలు బోగీల train మీద అనేక రంగుల్లో గీతలు ఉంటాయి. వాటి గురించి మనం పెద్దగా ఆలోచించం. ఏ రంగు గీతలు దేనికి సంకేతంతో ఇప్పుడు చూద్దాం..

yellow lines

meaning of the lines on the train

ట్రైన్ మీద పసుపు, తెలుపు, గ్రీన్ రంగుల్లో గీతలు ఉంటాయి. ఒక్కో రంగును బట్టి ఒక్కో కోచ్ ఒక్కో విభాగానికి చెందిందిగా చెపుతారు..

After all, why are the yellow and white stripes made on the train compartment, know this

బ్లూ కలర్ ఐసిఎఫ్ కోచ్ మీద తెలుపు రంగు గీతలు train

బ్లూ కలర్ ఐసిఎఫ్ కోచ్ మీద తెలుపు రంగు గీతలు ఉంటే, అది జనరల్ కోచ్ అని సూచిస్తుంది. అందులో సీట్లు రిజర్వ్ చేసి లేవు అని, అందులో ఎవరైనా ప్రయాణించవచ్చు అని ఆ గీతల అర్థం.

The Surprising Meaning Behind the White and Yellow Stripes on Train Coaches! | ixigo Travel Stories

కోచ్ మీద పసుపు రంగు గీతలు train

ఒకవేళ రైలు కోచ్ మీద పసుపు రంగు గీతలు అది ఉంటే దివ్యాంగులకి లేదా అనారోగ్యంతో ఉన్న వారికి అని అర్థం.

What does yellow and white line indicates on the train coaches?

గ్రే కలర్ మీద గ్రీన్ కలర్ గీతలు train

గ్రే కలర్ మీద గ్రీన్ కలర్ గీతలు ఉంటే అది కేవలం మహిళలకు మాత్రమే అని అర్థం. ఈ బోగీలు రైలు అటు చివర.. ఇటు చివర మాత్రమే ఉంటాయి.

Different Colour Schemes of Train Coaches: All That You Need to Know | RailMitra Blog

గ్రే కలర్ మీద ఎరుపు రంగు గీతలు

ఈఎంయు (ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్), లేదా ఎంఈఎంయు (మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్) ట్రైన్ పై గ్రే కలర్ మీద ఎరుపు రంగు గీతలు ఉంటే అది లోకల్ ట్రైన్ లో ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ అని అర్థం.

Also read

brahma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది