PAN Card : ఎటువంటి పనులకు పాన్ కార్డు ఉపయోగపడుతుందో మీకు తెలుసా?
PAN Card : మనకున్న గుర్తింపు కార్డుల్లో పాన్ కార్డు ఒకటి. పాన్ కార్డు బ్యాంకు లావాదేవీలకు కంపల్సరీ అన్న విషయం దాదపుగా అందరికీ తెలిసే ఉంటుంది. అయితే, ఈ కార్డు అక్కడ మాత్రమే కాకుండా ఇంకా పలు చోట్ల కూడా ఉపయోగించొచ్చు. పాన్ కార్డుతో చాలా ఉపయోగాలున్నాయి. అవేంటో ఈ స్టోరిలో తెలుసుకుందాం.బ్యాంకు ట్రాంజాక్షన్స్‌కు పాన్ కంపల్సరీ అన్న విషయం బ్యాంకు అకౌంట్ ఉన్న అందరికీ తెలిసే ఉంటుంది. రూ. 50 వేలకు మించి డిపాజిట్ చేయాలన్నా కూడా పాన్ కార్డు మస్ట్. పాన్ కార్డు లేకపోతే ఆ పనులు అస్సలు జరగవు. బ్యాంక్ ట్రాంజాక్షాన్స్, ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగానికి సంబంధించిన పనులన్నిటికీ పాన్ కార్డు చాలా అవసరం.
ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే ఈ పాన్ కార్డు ఆధార్, రేషన్ కార్డు మాదిరిగానే కీలకమైన డాక్యుమెంటని చెప్పొచ్చు.పాన్ కార్డును బైక్ కాకుండా ఇతర వెహికల్స్ కొనుగోలు చేసే క్రమంలో కంపల్సరీగా ఇవ్వాలి. బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్‌కు కూడా పాన్ మస్ట్ డాక్యుమెంట్. పాన్ కార్డు లేకపోయినా బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేస్తారు. కానీ, తర్వాత పాన్ కార్డు అప్లై చేసుకుని మరీ.. ఆ పాన్ కార్డు జిరాక్స్ బ్యాంకులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు కోసం అప్లికేషన్ చేసుకోవాలన్నా కూడా పాన్ మస్ట్ డాక్యుమెంట్.
PAN Card : ఈ లావాదేవీలకు ‘పాన్’ కంపల్సరీ..
ఇకపోతే ట్రేడింగ్ చేయాలనుకునే వారికి, డీ మ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకునే వారికి పాన్ మస్ట్. డిజిటల్ పేమెంట్స్ విషయంలో బిల్లు రూ. 50 వేలకు మించినట్లయితే హోటల్ లేదా రెస్టారెంట్ వారికి పాన్ కార్డు నెంబర్ చెప్పాలి. బ్యాంకులోనూ ఈ కండీషన్ వర్తిస్తుంది. రూ.50 వేలకు మించి ట్రాంజాక్షన్ చేస్తే కంపల్సరీగా పాన్ నెంబర్ ఇవ్వాలి. రూ.10 లక్షలకు పైన ప్రాపర్టీ కొనుగోలు చేయాల్సి వస్తే కంపల్సరీగా పాన్ నెంబర్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.