Gorintaku : గోరింటాకు ఎర్రగా పండాలంటే ఇవి తప్పకుండా వేయాల్సిందే..!
Gorintaku : గోరింటాకు అంటే ఇష్టపడని అమ్మాయిలు ఉండరు. కేవలం అమ్మాయిలే కాదండోయ్ చాలా మంది అబ్బాయిలకు కూడా గోరింటాకు పెట్టుకోవడం ఇష్టమే. చిన్నప్పుడు అమ్మ పెట్టే గోరింటాకు కోసం అబ్బాయిలు కూడా అమ్మాయితో పోటీ పడేవారు. అయితే పెట్టుకోవడమే కాదండోయ్… అది ఎర్రగా పండితే చూస్తూ మురిసిపోవాలని అనుకుంటారు. కానీ చాలా మందికి గోరింటాకు ఎర్రగా పండదు. అందుకే గోరింటారకు తయారు చేసేటప్పుడు కొన్ని పదార్థాలు వేయాల్సి ఉంటుంది. అలా కొన్ని రకాల పదార్థాలతో తయారు చేసిన గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎర్రగా పండుతుంది. అయితే అది ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే ముందుగా తెచ్చి పెట్టుకున్న గోరింటాకులో పూర్తి ఆకులను మాత్రమే తీసుకోవాలి. ఎలాంటి నారలు రాకుండా ఏరేయి. ఆ తర్వాత ఇందులో రెండు తమలపాకులు కూడా వేస్కోవాలి. ఇందులో తమలపాకులు వేస్కుంటే మరింత ఎర్రగా పండుతుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఈ గోరింటాకు రుబ్బడానికి మనం ఇప్పుడు నీటిని తయారు చేస్కుందాం. ఒక గ్లాస్ నీటిని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో పది లవంగాలను వేసుకోవాలి. ఈ నీరు రంగు మారేంత వ రకు మరిగించుకోవాలి. తర్వాత గోరింటాకులో తమలపాకును చిన్న చిన్న ముక్కులుగా తరిగి వేసుకోవాలి. ఇందులో లవంగాల నీటిని కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి. గోరింటాకు రుబ్బేటప్పుడు చాలా మంది చింతపండు ఉడికించి లేదా పచ్చిగా వేస్కుంటారు, మనం చింతపండు బదులు నిమ్మరసం కూడా వేసుకోవచ్చు.
కానీ ఈ రెండింటిలో ఏదో ఒక దాన్ని మాత్రమే వేసుకోవాలి. గోరింటాకును మెత్తని పేస్టుగా చేసుకున్న తర్వాత డిజైన్ ఎలా వేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.మీరు ఏ డిజైన్ వేసుకోవాలి అనుకుంటున్నారో దాన్ని చేతికి డిజైన్ లా వేసుకోవాలి. యూకలిప్టస్ ఆయిల్ అనేది మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది. దీన్ని డిజైన్ వేసుకున్న తర్వాత చేతులకు అప్లై చేసి తర్వాత గోరింటాకు పెట్టుకుంటే గోరింటాకు చాలా ఎర్రగా పండుతుంది. మనకు నచ్చిన డిజైన్ పెట్టుకున్న తర్వాత కనీసం రెండు, మూడు గంటల వరకు ఉంచుకోవాలి. వీలైతే రాత్రంతా ఉంచుకుంటే మరింత మంచిది. మార్నింగ్ లేచాక గోరింటాకు తీసిని వెంటనే నీటితో కడగకుండా యూకలిప్టస్ ఆయిల్ రాసుకోవాలి. ఇప్పుడు చెప్పిన చిట్కాలు పాటిస్తూ మీ చేతులను మందార పువ్వుల్లా అందంగా ఎర్రగా మెరిసేలా చేస్కోండి.