News Papers : న్యూస్ పేపర్లు పసుపు రంగులోకి ఎందుకు మారతాయి? కారణం ఏంటంటే..?
News Papers : చాలా మందికి ప్రతి రోజు న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంటుంది. కొందరికి పేపర్ చదవకుంటే రోజు స్టార్ట్ అయినట్టే అనిపించదు. ఇక ఉదయం పేపర్ చదివిన తర్వాత చాలా మంది దానిని మూలన పడేస్తారు. ఆ పేపర్ కొద్ది రోజుల తర్వాత పసుపు రంగులోకి మారుతుంది. నూస్ పేపర్లే కాదు, పుస్తకాలు కూడా ఇలా రంగు మారుతూ ఉంటాయి. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది. కారణం ఏంటి? ఓ నివేదిక ప్రకారం ఇందుకు ఆన్సర్ దొరికింది. కాగితాన్ని చెక్కతో తయారు చేస్తారు. చెక్కలో మూలకాలు రెండు రకాలుగా ఉంటాయి. సెల్యులోజ్, లిగ్నిన్ అని ఉంటాయి.
వీటి కారణంగానే పేపర్ రంగు మారుతుంది.కాగితంలోనే ఉన్న లిగ్నిన్ కణాలు.. సూర్యకాంతి, గాలి తాకినప్పుడు ప్రతి స్పందిస్తుంటాయి. దీనిని ఆక్సీకరణం అని అంటారు. ఇలాంటి టైంలో ఎక్కువ మొత్తంలో సూర్య కిరణాలను లిగ్నిన్ కణాలు గ్రహిస్తుంటాయి. వీటిని ఎక్కువగా గ్రహించడం వల్ల కాగితం రంగు మారుతుంది. అన్ని రకాల కాగితాలలో కలప ఉపయోగిస్తారు. కానీ కలప ఉపయోగించిన అన్ని పేపర్లు ఎందుకు పసుపు రంగులోకి మారవు అనే ప్రశ్న ఎదురవుతుంది. నిజమే.. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందువల్లే కొన్ని పేపర్లు రంగు మారకుండా అలాగే ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.
News Papers : సూర్య కాంతి తాకడం వల్ల..
దాని వెనుక కారణం ఏంటంటే.. ఖరీదైన కాగితాల్లో ఈ చర్య కొంచెం నెమ్మదిగా కొనసాగుతుంది. కారణం ఏంటంటే.. కాగితం తయారైన తర్వాత లిగ్నిన్ కాగితం నుంచి తీసివేస్తారు. అందువల్ల కాగితంలో లిగ్నిన్ లేకుంటే సూర్యకాంతితో ఎలాంటి ప్రతిచర్య జరగదు. దీని వల్ల కాగితం రంగును కోల్పోదు. పేపర్ రంగు మారడానికి, కొన్నింటిలో రంగు మార్పు కొంచెం నెమ్మదిగా జరగడానికి ఇదే కారణమని చెబుతున్నారు నిపుణులు. పేపర్లు రంగు మారడానేకి ఇదే కారణం.