Kiwi vs Papaya | ప్లేట్‌లెట్లు పెంచడంలో కివి vs బొప్పాయి .. ఏది ఎక్కువ ఉపయోగకరం?
Kiwi vs Papaya | రక్తంలోని ప్లేట్‌లెట్లు రక్తం గడ్డకట్టడంలో, గాయాలు వేగంగా మానడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కానీ వీటి స్థాయి తగ్గిపోతే అది తీవ్రమైన సమస్యగా మారవచ్చు. ముఖ్యంగా డెంగ్యూ బారిన పడిన వారిలో ప్లేట్‌లెట్ల స్థాయి ఒక్కసారిగా పడిపోవడం సాధారణం. ఈ పరిస్థితి ప్రాణాపాయానికి దారితీయవచ్చు. మందులతో తాత్కాలిక ఉపశమనం లభించినా, దీర్ఘకాలికంగా శరీరంలో ప్లేట్‌లెట్లు సమతుల్యంగా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవడం అత్యంత అవసరం.
ఇలాంటి సందర్భంలో చాలా మంది “బొప్పాయి తినాలి” అంటుంటారు, మరికొందరు “కివి తినాలి” అంటారు. అయితే వాస్తవానికి ఏది ఎక్కువ ప్రభావవంతం? నిపుణుల వివరాలు ఇలా ఉన్నాయి
#image_title
కివి పండు ప్రయోజనాలు
కివిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపించి రక్తనాళాల బలాన్ని కాపాడుతుంది.
ఫోలేట్: ఎర్ర రక్తకణాలు, ప్లేట్‌లెట్ల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది.
యాంటీఆక్సిడెంట్లు (పాలీఫెనాల్స్, కెరోటినాయిడ్స్): ప్లేట్‌లెట్లను ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తాయి.
ఆక్టినిడిన్ ఎంజైమ్: జీర్ణక్రియను మెరుగుపరుస్తూ పోషకాల శోషణకు తోడ్పడుతుంది.
పొటాషియం, ఫైబర్, ఎలక్ట్రోలైట్లు: శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచి వాపును తగ్గిస్తాయి.
కివి తినడం వలన శరీరంలో ఎముకమజ్జ పనితీరు మెరుగై, కొత్త ప్లేట్‌లెట్ల ఉత్పత్తి సులభతరం అవుతుంది.
బొప్పాయి ప్రయోజనాలు
బొప్పాయిలో కూడా విటమిన్ సి, బీటా కెరోటిన్, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్ల నుంచి వేగంగా కోలుకునే శక్తిని ఇస్తాయి.
బొప్పాయి ఆకుల రసం: డెంగ్యూ సమయంలో ప్లేట్‌లెట్లు పెంచడంలో ప్రభావవంతమని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.
పపైన్ ఎంజైమ్: జీర్ణక్రియను మెరుగుపరచి శరీరం పోషకాలను సరిగ్గా ఉపయోగించుకునేలా చేస్తుంది.
కైమోపాపైన్, పపైన్: వాపు తగ్గించి కణ ఆరోగ్యాన్ని కాపాడతాయి.
నీటి శాతం అధికం: నిర్జలీకరణాన్ని నివారించి శరీరానికి శక్తినిస్తుంది.
ఏది మంచిది?
కివి, బొప్పాయి రెండూ పోషకాలతో నిండి, ప్లేట్‌లెట్ల పెరుగుదలలో సహాయపడతాయి. కానీ బొప్పాయి సహజంగా ఎక్కువగా లభించడంతో పాటు చవకైనది కూడా. ముఖ్యంగా బొప్పాయి ఆకుల రసం డెంగ్యూ సమయంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.