Tomato | టమాటాలు అతిగా తీసుకుంటే అనర్ధాలే.. కొన్ని జాగ్రత్తలు తప్పవు..!
Tomato | టమాటా.. ప్రతి ఇంటి వంటగదిలో ఉండే కూరగాయ. దాదాపుగా ప్రతి వంటకం రుచిగా, రంగుగా ఉండాలంటే టమాటా తప్పదు. టమాటాల్లో విటమిన్ సి, పొటాషియం, లైకోపీన్, ఫైబర్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి రక్తహీనత, ఆస్తమా, అధిక బీపీ, కొలెస్ట్రాల్ వంటి ఆరోగ్య సమస్యల నుండి మిమ్మల్ని కాపాడగలవు. కానీ అదే టమాటాలను అతిగా తీసుకుంటే ఆరోగ్యానికి హానికరంగా మారతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

#image_title
టమాటాలు అధికంగా తింటే వచ్చే ప్రమాదాలు:
1. అసిడిటీ సమస్యలు
టమాటాలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో అసిడిటీని పెంచే మాంద్యం కలిగిస్తుంది. తరచూ టమాటాలను అధికంగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, గుండెల్లో మంట వంటి ఇబ్బందులు ఎదురవుతాయి.
2. గ్యాస్ సమస్య
మీకు ఇప్పటికే గ్యాస్ లేదా అజీర్ణ సమస్యలుంటే టమాటాలను ఎక్కువగా తినకూడదు. ఇవి కడుపులో ఎర్పడే గ్యాస్‌ను మరింతగా పెంచే అవకాశముంది.
3. కిడ్నీలో రాళ్లు
టమాటా గింజల్లో ఆక్సలేట్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇవి పిత్తాశయంలో లేదా మూత్రాశయంలో రాళ్లు ఏర్పడే అవకాశం పెంచుతాయి. అందుకే, టమాటాలు తినేటప్పుడు గింజలు తొలగించి తీసుకోవడం ఉత్తమం.
4. గుండెల్లో మంట & శ్వాసకోశ ఇబ్బందులు
అధికంగా టమాటాలు తినడం వల్ల పేగులో గ్యాస్ ఎక్కువగా ఏర్పడి, గుండెల్లో మంటకు కారణమవుతుంది. కొన్ని సందర్భాల్లో గొంతు మండడం, నోరు పొలిపోవడం వంటి సమస్యలు కూడా రావచ్చు.
టమాటాలో ఉండే ఫ్రక్టోజ్, కొందరిలో హిస్టామిన్ ప్రతిచర్యను ప్రేరేపించవచ్చు.ఇందులో ఉండే సోలనిన్ అనే ఆల్కలాయిడ్, కీళ్ల నొప్పులు, వాపులు వంటి సమస్యలకు కారణమవుతుంది.