Knee Pain | తరచుగా మోకాళ్ల నొప్పులు వస్తే నిర్లక్ష్యం చేయొద్దు .. వైద్య నిపుణుల హెచ్చరిక
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో కూడా విస్తృతంగా కనిపిస్తున్నాయి. ఎక్కువసేపు నిలబడటం, అధికంగా నడవడం, ఊబకాయం, ఎముకల బలహీనత, హార్మోన్ల మార్పులు వంటి కారణాలతో మోకాళ్ల సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది.

#image_title
నిర్లక్ష్యం చేయోద్దు..
నిరంతరం మోకాలి నొప్పిని చిన్న సమస్యగా తీసుకోవడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వైద్యుల వివరాల ప్రకారం, మోకాళ్ల నొప్పి వాపు, దృఢత్వం, మెట్లు ఎక్కడంలో ఇబ్బంది, నడిచేటప్పుడు శబ్దం, నొప్పి కారణంగా నిద్ర లోపం, మంట, ఎరుపు వంటి లక్షణాలతో కూడి ఉంటే అది తీవ్రమైన సమస్యకు సంకేతం.
తరచుగా వచ్చే మోకాలి నొప్పి ప్రధానంగా ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా గౌట్ వంటి వ్యాధుల కారణంగా ఉంటుంది. ఆస్టియో ఆర్థరైటిస్‌లో ఎముకల మధ్య మృదులాస్థి క్షీణించి నొప్పి పెరుగుతుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో రోగనిరోధక వ్యవస్థ ఎముకలు, కీళ్లను దాడి చేస్తుంది. గౌట్‌లో యూరిక్ యాసిడ్ పెరిగి కీళ్లలో స్ఫటికాలు ఏర్పడి తీవ్రమైన నొప్పి కలుగుతుంది. అదనంగా కాల్షియం లోపం, గాయాలు, అధిక బరువు కూడా సమస్యను మరింత తీవ్రమయ్యేలా చేస్తాయి. నీ క్యాప్ లేదా సపోర్ట్ ఉపయోగించాలని, నొప్పి కొనసాగితే వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.