Kisan Vikas Patra Scheme : రెట్టింపు వ‌డ్డీకి బెస్ట్ స్కీమ్.. కిసాన్ వికాస్ పాత్ర ప‌థ‌కం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kisan Vikas Patra Scheme : రెట్టింపు వ‌డ్డీకి బెస్ట్ స్కీమ్.. కిసాన్ వికాస్ పాత్ర ప‌థ‌కం

Kisan Vikas Patra Scheme : ఇండియ‌న్ పోస్ట్ ఖాతాదారుల‌కు ఎన్నో ర‌కాల పొదుపు, వ‌డ్డీ రేట్లను పొందే ప‌థ‌కాలు అందుబాటులో ఉన్నాయి. దేశంలోని ప‌లు బ్యాంకులు కూడా త‌మ క‌స్ట‌మ‌ర్ల‌కు ప్ర‌త్యేక వ‌డ్డీ రేట్ల‌ను అందిస్తున్న‌ప్ప‌టికీ పోస్ట్ ఆఫీస్ ఎక్కువ మొత్తంలో వ‌డ్డీని అంద‌జేస్తోంది. అందుకు గాను కిసాన్ వికాస్ పాత్ర అనే ప‌థ‌కం తీసుకువ‌చ్చింది. దీర్ఘ‌కాలికంగా డ‌బ్బుని పొదుపు చేసుకోవాల‌నుకునే వారికి రెట్టింపు వ‌డ్డీని అందిస్తోంది. ఈ స్కీమ్ లో పెట్టుబడి చేసేవారు తమ […]

 Authored By mallesh | The Telugu News | Updated on :20 June 2022,8:20 am

Kisan Vikas Patra Scheme : ఇండియ‌న్ పోస్ట్ ఖాతాదారుల‌కు ఎన్నో ర‌కాల పొదుపు, వ‌డ్డీ రేట్లను పొందే ప‌థ‌కాలు అందుబాటులో ఉన్నాయి. దేశంలోని ప‌లు బ్యాంకులు కూడా త‌మ క‌స్ట‌మ‌ర్ల‌కు ప్ర‌త్యేక వ‌డ్డీ రేట్ల‌ను అందిస్తున్న‌ప్ప‌టికీ పోస్ట్ ఆఫీస్ ఎక్కువ మొత్తంలో వ‌డ్డీని అంద‌జేస్తోంది. అందుకు గాను కిసాన్ వికాస్ పాత్ర అనే ప‌థ‌కం తీసుకువ‌చ్చింది. దీర్ఘ‌కాలికంగా డ‌బ్బుని పొదుపు చేసుకోవాల‌నుకునే వారికి రెట్టింపు వ‌డ్డీని అందిస్తోంది.

ఈ స్కీమ్ లో పెట్టుబడి చేసేవారు తమ భవిష్యత్తు, పిల్లల చదువులు, పెళ్లి వేడుకల కోసం డబ్బును ఫిక్స్ డ్ డిపాజిట్ చేసుకోవ‌చ్చు.ఇండియా పోస్ట్ ప్రవేశపెట్టిన కిసాన్ వికాస్ పత్ర పథకంలో తమ డబ్బును పెట్టిన వారికి రూ. 6.9 శాతం వార్షిక వడ్డీ అందిస్తున్నారు. ఈ వడ్డీరేటుతో కిసాన్ వికాస్ లెటర్ ప్లాన్‌లో మీ పెట్టుబడులు 124 నెలలు లేదా దాదాపు 10 సంవత్సరాలు ఉంచిన‌ట్లైతే ఆ తర్వాత త‌మ‌ పెట్టుబడులు రెట్టింపు అవుతాయి. కాగా పెట్టుబడి రూ. 10 లక్షలు అనుకుంటే 124 నెలల్లో అది 20 లక్షలుగా రెట్టింపు అవుతుంది.

double interest in Kisan Vikas Patra Scheme

double interest in Kisan Vikas Patra Scheme

Kisan Vikas Patra Scheme : పెట్టుబ‌డి పెడితే రెట్టింపు వ‌డ్డీతో ..

అలాగే స్కీమ్ లో డ‌బ్బు పెట్టిన త‌ర్వాత ఏదైనా కార‌ణాల‌తో తీసుకోవ‌ల‌నుకుంటే రెండున్న‌రేళ్ల త‌ర్వాత విత్ డ్రా చేసుకునే అవ‌కాశం క‌ల్పిస్తుంది. ఈ అమౌంట్ కి కూడా 6.9 శాతం వ‌డ్డీ ఇస్తుంది. కిసాన్ వికాస్ ప‌త్ర‌లో క‌నిష్టంగా రూ.1000తో కూడా పెట్టుబ‌డి ప్రారంభించ‌వ‌చ్చు. అలాగే గ‌రిష్ట పెట్టుబ‌డికి ప‌రిమితి ఏమి లేదు. అయితే రైతుల‌కోస‌మే ప్ర‌త్యేకంగా ప్రారంభించ‌బ‌డిన ఈ ప‌థ‌కంలో ప్ర‌స్తుతం 18 ఏళ్లు నిండిన ఎవ‌రైనా పెట్టుబ‌డి పెట్టుకోవ‌చ్చు. ఇందులో ప‌ర్స‌న‌ల్ అకౌంట్, జాయింట్ అకౌంట్ కూడా తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. నామినీ కూడా ఎంచుకునే ఆప్ష‌న్ ఉంది.

Also read

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది