Good News : మీ అకౌంట్లో డబ్బులు లేవా ? అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే ..!!
Good News : డబ్బులు ఎకౌంట్లో లేవని చింతిస్తున్నారా ! అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే. కేంద్ర ప్రభుత్వం పేదల కోసం జన్ ధన్ అకౌంట్ ఉన్నవారికి ఈ సదుపాయం అందించింది. అకౌంట్ జీరో బ్యాలెన్స్ ఉన్న పదివేల వరకు డ్రా చేసుకోవచ్చు. దీన్నే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటారు. అయితే ఈ సదుపాయం అకౌంట్ హోల్డర్స్ అందరికీ ఉండదు. ఎక్కువ లావాదేవీలు జరిపే వారికి మాత్రమే ఉంది. అయితే జన్ దన్ అకౌంట్ ఉన్నవారు పదివేల వరకు డ్రా చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం నిరుపేదలకు బ్యాంకింగ్ సేవలను అందించాలనే ఉద్దేశంతో 2014లో ప్రధానమంత్రి జన్ దన్ పథకాన్ని ప్రారంభించారు.
అసలు బ్యాంకింగ్ సేవలు గురించి తెలియని వారికి, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం, డబ్బులు దాచుకునేలా ప్రోత్సహించడం ఈ పథకం యొక్క లక్ష్యం. ఇక ప్రభుత్వం అందించే ఇతర పథకాల డబ్బుల్ని కూడా ఈ పథకం ద్వారా అందిస్తుంది. జన్ దన్ అకౌంట్ సాధారణ సేవింగ్స్ అకౌంట్. బేసిక్ అకౌంట్లో ఉండే ప్రయోజనాలన్నీ ఈ అకౌంట్లో ఉంటాయి. ఎవరైనా జన్ ధన్ ఎకౌంటును ఓపెన్ చేయవచ్చు. ఇతర ఎకౌంట్స్ ఓపెన్ చేస్తే అందులో మినిమం బాలన్స్ ఉండేలా చూడాలి. కానీ జన్ ధన్ ఎకౌంటుకు మినిమం బాలన్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఇక ఈ అకౌంట్ ఓపెన్ చేసిన వారికి ఉచితంగా రూపే డెబిట్ కార్డ్ లభిస్తుంది.
ఇదే కార్డు పై రెండు లక్షల వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ కాంప్లిమెంటరీ లభిస్తుంది. జన్ ధన్ ఎకౌంటు ఉన్నవారు పదివేల వరకు ఓవర్ డ్రాప్ట్ సదుపాయం పొందవచ్చు. అంటే ఎకౌంట్లో డబ్బులు లేకపోయినా 10,000 వరకు డ్రా చేసుకోవచ్చు. ఇది లోన్ లాంటిది. అంటే ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా ఎంత డ్రా చేస్తారో తిరిగి అంతే మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. దాదాపు అన్ని బ్యాంకుల్లో జన్ ధన్ అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకులో, ప్రైవేట్ బ్యాంకులు, రీజనల్ బ్యాంకులో జన్ ధన్ ఎకౌంటును ఓపెన్ చేయవచ్చు. అప్లికేషన్ ఫామ్ ను పూర్తిచేసి సబ్మిట్ చేసి, కేవైసీ ప్రాసెస్ ను పూర్తి చేస్తే చాలు.