Dried Chillies | ఎండు మిర్చి తినడం వల్ల ఆరోగ్యానికి లాభాలే లాభాలు.. ఒకసారి తెల్సుకోండి!
Dried Chillies | ఎండు మిర్చిని తాళింపుల్లోనూ, పచ్చళ్ళలోనూ ఖచ్చితంగా ఉపయోగిస్తాం. ఈ ఘాటైన పదార్థం వాసనకే కాకుండా ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుందన్న విషయం కొందరికి తెలియకపోవచ్చు ఎండు మిర్చిలో ఉండే కాప్సైసిన్ అనే పదార్థం శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. దీనివల్ల సాధారణ వైరల్, బాక్టీరియా సోకే అవకాశాలు తగ్గుతాయి.

#image_title
ఇన్ని ఉపయోగాలా?
బరువు తగ్గాలనుకునే వారికి ఇది సహాయకారి. ఎండు మిర్చి జీవక్రియ రేటును పెంచి, శరీరంలో కొవ్వును వేగంగా కరిగించడంలో సహాయపడుతుంది. కారం తినడం వల్ల ధమనుల్లోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి, గుండె సంబంధిత సమస్యల ప్రమాదం తగ్గుతుంది. బీపీ, షుగర్ లాంటి వ్యాధుల నియంత్రణకు కూడా ఇది తోడ్పడుతుంది. ఎండు మిర్చిలోని సహజ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలోని వాపులు, నొప్పులను తగ్గిస్తాయి. కండరాల బలహీనతను తగ్గించడంలోనూ ఇది సహాయపడుతుంది.
చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు లాంటి సీజనల్ ఇన్ఫెక్షన్లను నివారించడంలో ఎండు మిర్చి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. గాలిని సులభంగా పీల్చేందుకు సహాయపడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, ఎండు మిర్చిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కారకమైన కణాల పెరుగుదలపై ప్రభావం చూపిస్తాయి. కొందరు మితిమీరిన కారాన్ని ఆహారంలో తీసుకోవడం వల్ల ఆమ్లపిత్తం, అల్సర్లు, జీర్ణకోశ సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందుకే, ఎండు మిర్చిని కూడా మితంగా మాత్రమే తీసుకోవాలి.