
Dry Fish Curry you will want to eat it again and again
Dry Fish Curry : ఎండు చేపలు అంటే చేపలను పట్టిన తర్వాత వాటిని ఎండబెడతారు. ఇలా ఎండబెట్టిన వాటిని ఎండు చేపలు అంటారు. వీటిలో చాలా రకాలు ఉంటాయి. పెద్ద చేపలు, ఉప్పు చేపలు, రొయ్యలు, కడ్డీలు, ఇలా చాలా రకాలు ఉంటాయి. అయితే ఇలాంటి చేపలను కొందరు ఇష్టపడరు, కొందరు మాత్రం చాలా ఇష్టపడుతుంటారు. అయితే మనం ఇప్పుడు అందరూ ఇష్టపడేలా చేసుకుందాం. ఈ చేపల పులుసుని, దీనిని ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది.దీనికి కావలసిన పదార్థాలు: ఎండు చేపలు, చిక్కుడు గింజలు, వంకాయలు, ములక్కాయలు, కంద ము, పసుపు, కారం, ఉప్పు గరం మసాలా, చింతపండు పులుసు, టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, మెంతులు, ఆవాలు, కొత్తిమీర, ఆయిల్ మొదలైనవి.
దీని తయారీ విధానం: ముందుగా ఒక మట్టి పాత్రను తీసుకొని దానిలో నాలుగు స్పూన్ల ఆయిల్, వేసుకొని దానిలో పచ్చిమిర్చి నాలుగు చీలికలు తర్వాత కరివేపాకు, తర్వాత ఉల్లిపాయలు ముక్కలు సన్నగా తరిగినవి, తరువాత ఆవాలు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత దీనిలోకి వంకాయలు అలాగే ములక్కాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని వేసుకోవాలి. వీటిని కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత దీనిలో కంద ముక్కలను, ఒక ఆరు ముక్కలు వేసుకోవాలి. వీటిని ఒక పది నిమిషాలు మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. తర్వాత వీటిలో ఒక కప్పు టమాటా ముక్కలను, వేసుకోవాలి. తర్వాత పది నిమిషాల వరకు టమాటాలు మెత్తపడే వరకు ఉడకనివ్వాలి.
Dry Fish Curry you will want to eat it again and again
తర్వాత దీనిలోకి రెండు స్పూన్ల కారం, రెండు స్పూన్ల ఉప్పు, వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత దీనిలో చింతపండు రసం పోసుకోవాలి. అలాగే ఒక పావు లీటర్ నీటిని కూడా పోసుకోవాలి. మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి. తరువాత శుభ్రపరిచిన చేపలను తీసుకొని దానిలో ఒక ఐదు ఆరు వరకు వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి 15 నిమిషాల వరకు, అంటే నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. తర్వాత దింపే ముందు కొత్తిమీర ను చల్లుకొని దింపుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన చేపల పులుసు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది.
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్లకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
This website uses cookies.