Dwarka Story : ద్వారక ఎలా మునిగింది ..? శ్రీకృష్ణుడి మరణం ఎలా జరిగింది..?
ప్రధానాంశాలు:
Dwarka Story : ద్వారక ఎలా మునిగింది ..? శ్రీకృష్ణుడి మరణం ఎలా జరిగింది..?
శ్రీకృష్ణుడు కంసుడిని చంపిన సంగతి తెలిసిందే. దీంతో కంసుడి ఇద్దరి భార్యలు హస్తి మరియు ప్రక్తి తమ తండ్రి జరాసంధుడు వద్దకు వెళ్లి తమ భర్తను చంపిన కృష్ణుడిని చంపి ప్రతీకారం తీర్చండి అని కోరారు. దీంతో జరాసంధుడు కృష్ణుడిపై పగ పెంచుకుంటాడు. అప్పటినుంచి జరాసంధుడు కృష్ణుడు నివసిస్తున్న మధుర పై తన సైన్యంతో దండయాత్ర చేస్తూ ఉండేవాడు.
Dwarka Story ద్వారక నిర్మాణం
యుద్దాల కారణంగా ఎంతోమంది మధురా నగర ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కృష్ణుడు మొదటిగా మధుర నగర ప్రజలను కాపాడాలని ఆ తర్వాత జరాసంధుడి సంగతి తేల్చాలని అనుకుంటాడు. అప్పుడే సముద్రాన్ని కొద్దిగా భూమి అడిగి ద్వారకా నగరాన్ని నిర్మిస్తాడు. మధురానగర్ ప్రజలను ద్వారకాకి తీసుకువెళతాడు. ద్వారకానగరంలో లక్షల సంఖ్యలో రాజభవనాలు ఉండేవట. అలాగే ఈ నగరాన్ని వజ్రాలు, బంగారం, ముత్యాలు వంటి అపురూపమైన వాటితో నిర్మించారు. ఇక ఈ ద్వారకా నగరాన్ని శ్రీకృష్ణుడే పాలించాడు. ద్వారకా నగర నిర్మాణంలో ఎటువంటి లోపాలు లేకుండా నగరాన్ని ఆరు విభాగాలుగా విభజిస్తూ నిర్మించారు. దాదాపుగా 10 లక్షల మంది జనాభా ఉండేవారు. వారికి కావాల్సి సదుపాయాలని నగరంలో ఉండేవి. అప్పట్లో ఈ నగరాన్ని స్వర్ణ నగరం అనేవారు. ఇక జరాసంధుడు నుంచి ప్రజలకు ఆపద కలగకుండా శ్రీకృష్ణుడు భీముడిచే అంతం చేశాడు. అయినా శత్రు పరంపర అనేది శ్రీకృష్ణుడిని వెంటాడటం మానలేదు. ఆ తర్వాత శ్రీకృష్ణుడి మేనత్త కొడుకు అయినా శిశుపాలుడు శ్రీకృష్ణుడి పై పగతో ద్వారకాపై దండెత్తాడు. శ్రీకృష్ణుడు అతడిని అంతం చేశాడు. ఆ తర్వాత శిశుపాలుడు సోదరుడు సాల్వుడు శ్రీకృష్ణుడిని చంపేందుకు యత్నించాడు. అతడిని కూడా శ్రీకృష్ణుడు అంతం చేసాడు.
Dwarka Story గాంధారి శాపం
శిశుపాలుడు సాల్వుడిని అంతం చేసిన తర్వాత ద్వారకాకు శాపం తగిలింది. ఆ శాపం కౌరవుల తల్లి గాంధారిధి. ఆమె శపించడానికి గల కారణం ఉంది. పాండవులు, కౌరవుల మధ్య హస్తినాపురం సింహాసనానికి కోసం కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో పాండవులు గెలవగా 100 మంది కౌరవుల్లో దుర్యోధనుడు తప్ప మిగతా 99 మంది చనిపోతారు. ఈ కురుక్షేత్ర యుద్ధంలో ఇద్దరి తరపున శ్రీకృష్ణుని తటస్థంగానే ఉన్నాడు. నేను మరియు యాదవ సైన్యం ఈ రెండింటిలో మీరు ఒకదానిని కోరుకోండి అనగా పాండవులు శ్రీకృష్ణుడిని కోరుకోగా కౌరవులు శ్రీకృష్ణుడు సైన్యాన్ని కోరుకుంటారు. అలా కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల తరుపున శ్రీకృష్ణుడు ఉన్నా కూడా కేవలం అర్జునుడు రథాన్ని నడిపాడు తప్ప యుద్ధానికి దిగలేదు. 18 రోజుల భీకర యుద్ధంలో పాండవులు గెలిచారు. యుద్ధం తర్వాత 99 మంది బిడ్డలను కోల్పోయిన కౌరవుల తల్లి గాంధారి చాలా దుఃఖంలో మునిగిపోయి ఉంటుందని గ్రహించి ఆమెను పరామర్శించడానికి శ్రీకృష్ణుడు ఆమె దగ్గరికి వెళ్ళాడు.
ఆమె కోపంతో నువ్వు నా బిడ్డలను కాపాడాలని ఏమాత్రం ఉద్దేశం ఉన్న ఈ కురుక్షేత్ర యుద్ధాన్ని మధ్యలోనే ఆపగలిగే వాడివి. ఎందుకు అలా చేయలేదని కృష్ణుడిని ప్రశ్నిస్తుంది. అప్పుడు కృష్ణుడు మాతా గాంధారి నీ భర్త దృతరాష్ట్రుడు గత జన్మలో ఒక హంస, దానికి పుట్టిన పిల్లల విషయంలో పెద్ద తప్పు చేశాడు. ఆ కర్మ ఫలితము ఈ జన్మలో చూపు కోల్పోయాడు. అలాగే 100 మంది బిడ్డలను కోల్పోయాడు అని అంటాడు. దీంతో మరింత ఆగ్రహానికి గురైన గాంధారి నా భర్త అంటే తప్పు చేశారు ఇది ఆయన కర్మ. ఏ పాపం ఎరుగని నాకు ఇంత పెద్ద శిక్ష ఎందుకు వేశారు అంటూ నువ్వు కూడా నాలాగే నీ పిల్లల్ని అంటే యాదవ ప్రజల్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది. నీ యాదవ జాతి మొత్తం నీతోటే అంతమైపోవాలి అంటూ గాంధారి శ్రీకృష్ణుడిని శపిస్తుంది. ఇక గాంధారి దుష్టులకు తల్లి కావచ్చు కానీ ఆమె శాపం ఫలిస్తుందని కృష్ణుడికి తెలుసు. మూడు దశాబ్దాల తర్వాత గాంధారి శాపం మొదలైంది. గాంధారి శాపం ద్వారకా నగర అంతానికి కారణమైంది.
Dwarka Story మునుల శాపం
ఇదేకాక మరో శాపం కూడా వెంటాడిందని భారతం చెబుతుంది. నారదుడు, కణ్వుడు, విశ్వామిత్రుడు కొంతమంది ఋషులు ఒకసారి కృష్ణుడిని చూడడానికి ద్వారకా కు వచ్చారు. ఆ సమయంలో ఆ మహర్షులను యాదవులు ఆటపట్టించారు. ఒక మగవాడికి ఆడవేషం వేసి తీసుకొచ్చి కూతురు పుడుతున్న కొడుకు పుడుతుందా అని వాళ్ళు హేళనగా అడిగారు. దీంతో ఆ మునులంతా ఆవేశానికి గురై వీడికి ముసలం పుడుతుంది అని చెప్పి కృష్ణుని కలవకుండానే వెనక్కి వెళ్ళిపోతారు. ఇలా ఈ శాపాలని ద్వారకా నగరాన్ని వెంటాడుతూ వచ్చాయి. సాల్వుడి అంతం, మునుల అవమానం, గాంధారి శాపం వలన యాదవులు వారిలో వారు పదవుల కోసం ఒకరినొకరు చంపుకోవడం మొదలుపెట్టారు. ఇదంతా కళ్ళ ముందు జరుగుతున్న కృష్ణుడు చూస్తూ ఏమి చేయలేకపోయారు. సముద్రుడు ద్వారకాన్ని ముంచి వేస్తున్నట్లు ఆకాశవాణి ద్వారా హెచ్చరికలు వినిపించాడు. తన ముందు యాదవులు చంపుకోవడం, తన్నుకోవడం చూసి శ్రీకృష్ణుడు తట్టుకోలేకపోయాడు. ఇక చివరికి అర్జునుడిని ద్వారకాకి పిలిపించి యాదవుల బరువు బాధ్యతలు అర్జునుడికి అప్పగించి తాను అడవులకు వెళ్ళిపోయాడు.
Lord Krishna శ్రీకృష్ణుడి మరణం
అడవిలో ఒకరోజు చెట్టుపై ఏకాంతంగా కూర్చుని ఉండగా పొరపాటున ఒక వేటగాడి బాణం వచ్చి శ్రీకృష్ణుడికి తగులుతుంది. దీంతో కృష్ణుడు తనువు చాలించాడు అంటే మరణించాడు. అయితే ఆయన మరణం లోక కళ్యాణం కోసమే జరిగింది. ఇది శ్రీకృష్ణుడి అవతారానికి ముగింపు. ఆ తర్వాత అర్జునుడు కృష్ణుడికి అంత్యక్రియలు జరిపి మిగిలిన యాదవ స్త్రీలను, వృద్ధులను, పిల్లలను తీసుకొని తన రాజ్యమైన హస్తినాపురానికి తీసుకువెళతాడు.
Dwarka Story ద్వారకా అంతం
ఆ తర్వాత అర్జునుడు చూస్తుండగానే ఆకాశం గర్జించింది. ఉరుములు తోకచుక్కలు ద్వారకాపై కురిసాయి. సముద్రుడు ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చి ద్వారకను తనలో కలుపుకుంది. ఇలా ద్వారకా నగరం కురుక్షేత్రం జరిగిన 31 సంవత్సరాల తర్వాత సముద్రంలో కలిసిపోవడం జరిగింది. ఇక ఈ ద్వారక మునిగిన 2500 సంవత్సరాల తర్వాత ఇలా అరేబియన్ పశ్చిమ తీరంలో గోమతి అనే నది సముద్రంలో కలిసే చోట సముద్రం కింద ఒక నగరం ఉందనే విషయం కొన్ని అవశేషాలు దొరకటం ద్వారా మొట్టమొదటిగా 1983లో తెలియడం జరిగింది. సముద్రంలో బయటపడ్డ ఆ నగరం ద్వారకా నగరం అని చారిత్రకులు చెప్పారు.