Krishnashtami : పుట్టే పిల్లలకు కూడా ట్రెండ్ ఫాలో అవుతున్నారా.. కృష్ణాష్టమి రోజు ఆ ముహుర్తం కోసం పోటీ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Krishnashtami : పుట్టే పిల్లలకు కూడా ట్రెండ్ ఫాలో అవుతున్నారా.. కృష్ణాష్టమి రోజు ఆ ముహుర్తం కోసం పోటీ..!

Krishnashtami : కృష్ణాష్టమి వస్తే చాలు తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్ని కృష్ణుడు, గోపిక వేషధారణ వేసి ముచ్చటపడతారు. కృష్ణుడి గెటప్ లో పిల్లలు కూడా భలే ముద్దుగా అనిపిస్తారు. కృష్ణాష్టమి రోజు కొత్త పనులను మొదలు పెట్టే వారు కూడా ఉంటారు. ఐతే దేశం లో ఎప్పుడు లేని విధంగా ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. శ్రీకృష్ణుడు జన్మించిన వేళల్లో పురుడు పోసుకోవాలని చాలామంది గర్భిణీలు ఆసక్తి చూపిస్తున్నారు. మామూలుగా అయితే అష్టమి గడియల్లో ఏ […]

 Authored By aruna | The Telugu News | Updated on :29 August 2024,2:00 pm

Krishnashtami : కృష్ణాష్టమి వస్తే చాలు తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్ని కృష్ణుడు, గోపిక వేషధారణ వేసి ముచ్చటపడతారు. కృష్ణుడి గెటప్ లో పిల్లలు కూడా భలే ముద్దుగా అనిపిస్తారు. కృష్ణాష్టమి రోజు కొత్త పనులను మొదలు పెట్టే వారు కూడా ఉంటారు. ఐతే దేశం లో ఎప్పుడు లేని విధంగా ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. శ్రీకృష్ణుడు జన్మించిన వేళల్లో పురుడు పోసుకోవాలని చాలామంది గర్భిణీలు ఆసక్తి చూపిస్తున్నారు. మామూలుగా అయితే అష్టమి గడియల్లో ఏ పని చేయకూడని అంటుంటారు. కానీ కృష్ణాష్టమి రోజు మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది.

Krishnashtami : ఈసారి ఎక్కువ కేసులు ఇలా..

కృష్ణుడు పుట్టిన నక్షత్రం కాబట్టి ఆరోజు అష్టమి ఉన్నా సరే పనులు మొదలు పెడతారు. ఐతే కొత్తగా కృష్ణాష్టమి రోజు పిల్లలకు జన్మనివ్వాలని కోరుతున్న వారి సంఖ్య పెరుగుతుందని తెలుస్తుంది. కృష్ణాష్టమి గడియల్లోనే తాము డెలివెరీ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు ప్రత్యేక స్లాట్ బుక్ చేసుకుంటున్నారని తెలుస్తుంది. ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రా లో కొన్ని హాస్పిటల్స్ లో కృష్ణాష్టమి రోజు కాంపు కోసం గర్భిణులు స్లట్ బుక్ చేసుకున్నారు. కృష్ణాష్టమి రోజు రాత్రి 12 గంటలు సాయంత్రం 4 గనలకు డెలివెరీ చేసేలా స్లాట్ బుక్ చేసుకున్నారని వైద్యులు చెబుతున్నారు.

ఈసారి కృష్ణాష్టమి రొహిత్ నక్షత్రం రావడంతో ఆ అమృత గడియల్లో సిజేరియన్ డెలివెరీ చేసేలా కపుల్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆదివారం రాత్రి నుంచే ఈ కేసులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. కృష్ణాష్టమి రోజున దాదపు 250 మందికి డెలివెరీ చేసినట్టు చెప్పుకొచ్చారు. ఐతే గత ఏడాదితో పోల్చితే కృష్ణాష్టమి తిథి రోజు డెలివీరీ సంఖ్య విపరీతంగా పెరిగిందని ప్రముఖ గైనకాలజిస్ట్ డా నరేంద్ర మల్ హోత్రా చెప్పారు. ఐతే రాత్రి 12, సాయంత్రం 4 గంటలకు కూడా బుకింగ్స్ చేసుకుని డాక్టర్ వెల్లడించారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది