Lungs : ఈ ఆహారాలను తీసుకోండి… మీ ఊపిరితిత్తులను రక్షించుకోండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Lungs : ఈ ఆహారాలను తీసుకోండి… మీ ఊపిరితిత్తులను రక్షించుకోండి…!

 Authored By ramu | The Telugu News | Updated on :30 June 2024,7:00 am

Lungs : వర్షాకాలం రాలే వచ్చేసింది.ఈ కాలంలో వాతావరణం లో తేమ అనేది ఎక్కువ శాతం ఉంటుంది. అదే టైంలో సిజన ల్ వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే. జలుబు,దగ్గుతో పాటుగా ఊపిరితిత్తుల ఆరోగ్యం పై కూడా ఎంతో ప్రభావం పడుతుంది. దీంతో జలుబు,న్యూమోనియా,క్షయ, ఉబ్బసం,క్యాన్సర్, శ్వాస తీసుకుంటంలో ఇబ్బంది, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే సిజనల్ సమస్యల నుండి ఉపశమనం కలిగించే ఆహారం,ముఖ్యంగా ఊపిరితిత్తులకు ఆరోగ్యానికి కూడా కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

గ్రీన్ టీ రెగ్యులర్ గా తీసుకోవడం వలన దీనిలో ఉన్నటువంటి క్యాటేచిన్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్ల కారణం వలన ఊపిరితిత్తుల పనితీరు ఎంతో బాగా మెరుగుపడుతుంది. గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో బాగా మేలు చేస్తుంది. ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడానికి అవసరమైన విటమిన్లు మరియు యాంటీ యాక్సిడెంట్లు అధికంగా ఉండే బ్లూ బెర్రీస్, నేరేడు పండ్లు, బెర్రీలు లాంటి వాటికి ఆహారంలో చేర్చుకోవడం చాలా అవసరం.ఇవి శరీర వాపును తగ్గించేందుకు మరియు ఊపిరితిత్తుల పని తీరును మెరుగుపరచడానికి సాల్మాన్ చెపలు, వాల్ నట్స్ లాంటి ఒమేగా త్రీ,కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవటం చాలా అవసరం. రోగ నిరోధక శక్తిని పెంచేందుకు, సీజనల్ సమస్యల నుండి ఉపశమనం కలిగేందుకు మీరు తీసుకునే ఆహారంలో కొద్దిగా పసుపును కూడా వేసుకుంటే మంచిది. ఇలా పసుపుని ఆహారంలో చేర్చుకోవటం వలన శ్వాస కోశ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది.

Lungs ఈ ఆహారాలను తీసుకోండి మీ ఊపిరితిత్తులను రక్షించుకోండి

Lungs : ఈ ఆహారాలను తీసుకోండి… మీ ఊపిరితిత్తులను రక్షించుకోండి…!

ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ కోసం బచ్చలి కూర, తోటకూర, పాలకూర లాంటి ఆకుకూరలను మీ ఆహారంలో చేర్చుకొండి. బ్రోకలీ, యు బ్రస్సెల్స్, మొలకలు లాంటి కూరగాయలను ఆహారంలో చేర్చుకోవడం వలన యాంటీ ఇన్ ఫ్లమెంటరీ లక్షణాలు అనేవి పెరిగి వర్షాకాలంలో మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచటంలో ఎంతో బాగా మేలు చేస్తుంది.అలాగే నారింజ, నిమ్మ,ఉసిరి లాంటి సిట్రస్ పండ్ల లో విటమిన్ సి అనేది అధికంగా ఉంటుంది. ఇవి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మరియు రోగనిరోధక శక్తి ని పెంచడంలో కూడా ఎంతో బాగా సహాయపడుతుంది…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది