Lungs : ఈ ఆహారాలను తీసుకోండి..మీ ఊపితులను రక్షించుకోండి…!
ప్రధానాంశాలు:
Lungs : ఈ ఆహారాలను తీసుకోండి..మీ ఊపితులను రక్షించుకోండి...!
Lungs : మనం హాయిగా ఊపిరి పీల్చుకోవాలి అంటే ఊపిరితిత్తులు ఎంతో ఆరోగ్యంగా ఉండాలి. మరీ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలి అంటే. వాటికి వచ్చే అనారోగ్యాలను నివారించాలి. వీటిని నివారించాలి అంటే. కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఈ తరుణంలో ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం మన రోజువారి జీవితంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాలి. ఊపిరితిత్తుల కు సంబంధించినటువంటి ప్రధాన ప్రమాద కారకాలలో కొన్ని జలుబు,న్యూమోనియా, క్షయ, అస్తమ, క్యాన్సర్, శ్వాస కోశం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి కొన్ని రకాల సమస్యలు ఉన్నాయి. వీటి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి అనుకున్నట్లయితే కొన్ని ఆహార పదార్థాలను ఖచ్చితంగా తీసుకోవాలి అని వైద్యులు చెబుతున్నారు. ఆ ఆహార పదార్థాలు ఏమిటో చూద్దాం…
గ్రీన్ టీ లో ఉన్న క్యాటేచిన్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఊపిరితిత్తుల పనితీరు మరియు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అందుకే ప్రతినిత్యం గ్రీన్ టీ తాగాలి అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఊపిరితిత్తుల పని తీరుకు సహాయపడే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నటువంటి బ్లూ బెర్రీస్, క్రాన్ బెర్రీస్,లాంటి బెర్రీలను తీసుకోవటం కూడా చాలా మంచిది అని అంటున్నారు. ఇది శరీర వాపును నియంత్రించటానికి మరియు ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడానికి సాల్మన్ చేపలు, వాల్ నట్స్ లాంటి ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉన్నటువంటి ఆహారాలను తీసుకుంటే మంచిది. అంతేకాక ఆహారంలో పసుపుతో పాటు, దాని ఇమ్యూనోస్టిమ్యులేంట్ లక్షణాలు శ్వాసకోశాన్ని మెరుగుపరిచేందుకు ఎంతగానో సహాయం చేస్తాయి.
ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అధిక యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ల కోసం పాలకూర లాంటి ఎన్నో రకాల ఆకుకూరలను మీ ఆహారంలో అధికంగా చేర్చుకోవాలి. అలాగే బ్రోకలీ బ్రస్సెల్స్ లాంటి కూరగాయలను కూడా మీ ఆహారంలో చేర్చుకోవడం వలన దీనిలోని యాంటీ ఇన్ ఫ్లమెంటరీ లక్షణాలు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతో బాగా హెల్ప్ చేస్తాయి. అంతేకాక నారింజ, నిమ్మకాయ లాంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటుగా రోగ నిరోధక శక్తిని కూడా ఎంతో ప్రోత్సహిస్తుంది…