Curd | పాలు, పెరుగు ఖాళీ కడుపుతో అస్స‌లు తీసుకోవ‌ద్దు.. నిపుణుల హెచ్చరిక | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Curd | పాలు, పెరుగు ఖాళీ కడుపుతో అస్స‌లు తీసుకోవ‌ద్దు.. నిపుణుల హెచ్చరిక

 Authored By sandeep | The Telugu News | Updated on :22 August 2025,11:00 am

Curd | పాల ఉత్పత్తులు ఆరోగ్యానికి మేలు చేస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇవి తినే సమయం కూడా ఎంతో ముఖ్యమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఖాళీ కడుపుతో పాలు లేదా పెరుగు తినడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపవచ్చని వారు హెచ్చరిస్తున్నారు. చాలా మంది రోజును గ్లాసు పాలతో ప్రారంభించడం, ఉదయం పెరుగు తినడం వంటి అలవాట్లు కొనసాగిస్తున్నారు.

#image_title

ఈ త‌ప్పులు చేయ‌కండి..

కానీ ఇదే విషయంలో నిపుణులు ఓ కీలకమైన విషయాన్ని చెబుతున్నారు. ఉదయం ఖాళీ కడుపుతో పాలు తాగడం, పెరుగు తినడం వల్ల ఉబ్బరం, అసిడిటీ, కడుపు నొప్పి, యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు ఏర్పడవచ్చని చెబుతున్నారు. పాల ఉత్పత్తుల్లో సహజ లాక్టిక్ ఆమ్లం అధికంగా ఉండటంతో, ఇది కడుపులో ఉన్న ఆమ్ల స్థాయిని పెంచుతుంది. ముఖ్యంగా పెరుగులో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా, ఖాళీ కడుపుతో తీసుకున్నపుడు కొన్ని సందర్భాల్లో నెగటివ్ ప్రభావాలు చూపవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

నిపుణుల సూచన ప్రకారం, పాలు లేదా పెరుగు లాంటి పాల ఉత్పత్తులను మధ్యాహ్న భోజనం తర్వాత లేదా సాయంత్రం సమయంలో తినడం మంచిదని వారు సూచిస్తున్నారు. తినే ముందు కొంత అల్పాహారం తీసుకోవడం వల్ల ఈ సమస్యలు నివారించవచ్చని తెలియజేస్తున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది