Curd | మధ్యాహ్నం పెరుగు తింటే ఆరోగ్యమే.. రాత్రి తింటేనే హానికరం! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Curd | మధ్యాహ్నం పెరుగు తింటే ఆరోగ్యమే.. రాత్రి తింటేనే హానికరం!

 Authored By sandeep | The Telugu News | Updated on :24 October 2025,11:59 am

Curd | పెరుగు మన ఆహారంలో ఓ ముఖ్యమైన భాగం. ఇది రుచికరమైనదే కాకుండా ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తుంది. కానీ ఎప్పుడు తింటే మంచిదో, ఎప్పుడు తినకూడదో చాలా మందికి తెలియదు.ఆరోగ్య నిపుణుల చెబుతున్న ప్రకారం, పెరుగు చల్లదన గుణం కలిగి ఉంటుంది. కాబట్టి మధ్యాహ్నం సమయంలో తింటే శరీరం దానిలోని పోషకాలను బాగా గ్రహిస్తుంది. పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా (ప్రోబయోటిక్స్) జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

#image_title

న‌ష్టాలు ఇవే..

ఇందులో ప్రొటీన్, కాల్షియం, విటమిన్‌ బి2, విటమిన్‌ బి12, పొటాషియం, లాక్టిక్‌ ఆమ్లం వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కండరాల పెరుగుదలకు, ఎముకల ఆరోగ్యానికి, నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి దోహదం చేస్తాయి. పెరుగులో వేయించిన జీలకర్ర పొడి కలిపి తింటే జీర్ణక్రియ మరింత మెరుగవుతుంది. అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు, పెరుగు శరీర శక్తిని పెంచి అలసటను తగ్గిస్తుంది.

అయితే నిపుణుల హెచ్చరిక ప్రకారం, రాత్రిపూట పెరుగు తినకూడదు. ఎందుకంటే రాత్రి పెరుగు తినడం వల్ల జలుబు, దగ్గు, కఫం వంటి సమస్యలు రావచ్చు. చలికాలంలో అయితే ఉదయం, రాత్రి పెరుగు తినడం పూర్తిగా మానేయాలని వైద్యులు సూచిస్తున్నారు.పెరుగులోని ప్రోటీన్, కొవ్వు పదార్థాలు రాత్రిపూట జీర్ణక్రియను మందగిస్తాయి, దీని వల్ల అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. అలాగే మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు పెరుగు తినకూడదు, ఎందుకంటే ఇందులో అధికంగా ఉండే భాస్వరం, పొటాషియం మూత్రపిండాలకు హానికరం.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది