EENADU Fake News : ఈనాడు ఫేక్ న్యూస్ తో రెచ్చిపోతోంది .. అసలు జరిగింది ఇదే .. TTN FACT CHECK !
EENADU Fake News : ఈనాడు పత్రిక గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దానికి మరో పేరు ఎల్లో మీడియా. మరో విధంగా చెప్పాలంటే టీడీపీ అధినేత చంద్రబాబు ఆలోచనలన్నింటినీ అక్షర రూపం దాల్చేది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఈనాడు రాసిన రాతలు అందరికీ తెలుసు. ప్రతిపక్ష నేత జగన్ పై ఉక్కుపాదం మోపారు. ఇప్పుడు చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్న జగన్ పై విషం చిమ్ముతోంది. చంద్రబాబు నేరుగా మాట్లాడుకుండా ఇలా పత్రికల ద్వారా రాయిస్తుంటారు. పేదలకు స్థలాలు ఇవ్వడం తప్పా.
పేదలకు ఎలా స్థలాలు ఇస్తారంటూ కోర్టు మెట్లు ఎక్కిన చంద్రబాబుకు వత్తాసు పలికిన ఈనాడును ఏమనాలి. ఆర్ 5 జోన్ ను ఎందుకు అడ్డుకుంటున్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక తూకం దెబ్బతింటుందని అనడం ఏంటి. పేదలకు, బలహీన వర్గాలకు రాజధానిలో చోటు ఉండకూడదా? ఇంతటి దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా? సీఆర్డీఏ చట్టాన్ని కూడా తుంగలో తొక్కేశారు చంద్రబాబు. కనీసం 120 గజాలు ఉంటేనే నిర్మాణాలకు అనుమతి ఇస్తామని చంద్రబాబు చెప్పారు. కానీ.. చంద్రబాబు పేదల కడుపులను కొడుతుంటే చూడలేక.. ఆ 120 గజాల నిబంధనను తీసేసి ఆర్ 5 జోన్ ను తీసుకొచ్చింది జగన్ ప్రభుత్వం.
EENADU Fake News : స్థలాల పంపిణీని అడ్డుకునేందుకు కేసులు వేసిన చరిత్ర చంద్రబాబుది
పేదలకు వ్యతిరేకంగా.. స్థలాల పంపిణీ చేపట్టకూడదని కేసులు వేసిన చరిత్ర చంద్రబాబుది. పచ్చ మీడియాను చూసుకొని ఇంతలా రెచ్చిపోతారా? ఏది పడితే అది రాసేస్తారా? పేదలంటే అంత చులకనా? సీఆర్డీఏ పరిధిలో ఇప్పుడు జగన్ ప్రభుత్వం 1402.58 ఎకరాలను కేటాయించి.. రాజధాని ప్రాంతంలో 50,004 మందికి ఇంటి స్థలాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఆపాలని చంద్రబాబు ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ.. అది వీలుపడలేదు. ఆర్ 5 జోన్ కే మద్దతుగా కోర్టులలో తీర్పులు వెలువడగా ఇప్పుడు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు జగన్ ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది.