Hair | జుట్టు రాలడం సమస్యతో బాధపడుతున్నారా?.. ఈ చిట్కాలు పాటించండి..!
Hair | జుట్టు రాలడం నేటి తరంలో సాధారణ సమస్యగా మారింది. పురుషులలో బట్టతల రేటు పెరుగుతుండగా, మహిళలలో కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. మార్కెట్లో జుట్టు రాలడం నివారించడానికి అనేక మందులు, చికిత్సలు లభిస్తున్నప్పటికీ, వాటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశమూ ఉంది. అయితే ఇంట్లో లభించే సహజ పదార్థాలతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
#image_title
ఎర్రపప్పుతో జుట్టు రాలే సమస్యకు చెక్
మీ వంటగదిలో ఉండే ఎర్రపప్పు జుట్టు ఆరోగ్యానికి అద్భుత ఫలితాలను ఇస్తుంది. ఇందులో ఐరన్, ప్రోటీన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ C వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడమే కాకుండా జుట్టు మెరుపును పునరుద్ధరించడంలో సహాయపడతాయి. ఎర్రపప్పులోని ఇనుము తల చర్మానికి రక్త ప్రసరణను మెరుగుపరచి జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తుంది.
మెంతులు, కరివేపాకుతో సహజ పరిష్కారం
వంటింట్లో లభించే మెంతులు, కరివేపాకు కూడా జుట్టు రాలే సమస్యను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని కలిపి పేస్ట్‌లా తయారు చేసి తలకు అప్లై చేయడం ద్వారా జుట్టు బలంగా మారుతుంది.
ఇలా క్రమంగా వాడితే జుట్టు రాలడం తగ్గి, కొత్త జుట్టు పెరుగుదలలో సహాయపడుతుంది. ముఖ్యంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజంగా జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి ఇవి ఉత్తమ మార్గాలు అని నిపుణులు సూచిస్తున్నారు.