Moong Vs Masoor Dal | పెసరపప్పు-ఎర్రపప్పు.. ఈ రెండింట్లో ఏది ఆరోగ్యానికి మంచిది..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Moong Vs Masoor Dal | పెసరపప్పు-ఎర్రపప్పు.. ఈ రెండింట్లో ఏది ఆరోగ్యానికి మంచిది..?

 Authored By sandeep | The Telugu News | Updated on :25 August 2025,9:00 am

Moong Vs Masoor Dal | భారతీయ వంటకాల్లో పప్పు ధాన్యాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇవి పోషకాలతో నిండి ఉండటంతోపాటు రుచిలోనూ ప్రత్యేకత కలిగి ఉంటాయి. ముఖ్యంగా పెసరపప్పు మరియు ఎర్రపప్పు (మసూర్ దాల్) ఆరోగ్యానికి అనేక రకాల లాభాలను అందిస్తాయి. ఇవి శరీరానికి అవసరమైన ప్రొటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు వంటి ముఖ్యమైన పోషకాలను సమృద్ధిగా కలిగి ఉంటాయి.

#image_title

పెసరపప్పు..సులభంగా జీర్ణమయ్యే పోషక భాండారం

పెసరపప్పు (మూంగ్ దాల్)లో ప్రొటీన్, డైటరీ ఫైబర్, ఐరన్, కాల్షియం, విటమిన్ B సమూహాలు, తక్కువ కొవ్వు ఉంటుంది. ఈ పప్పు తేలికగా జీర్ణమవుతుంది, అందువల్ల జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారికి ఇది ఉత్తమం. ఇది బరువు తగ్గాలనుకునేవారికి సహాయపడుతుంది, శక్తిని అందిస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఎర్రపప్పు – శక్తివంతమైన పోషక నిధి

ఎర్రపప్పు (మసూర్ దాల్)లో అధిక ప్రొటీన్, ఫైబర్, ఐరన్, ఫోలేట్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు స‌మృద్ధిగా ఉంటాయి. ఈ పప్పు ఎముకలను బలపరచడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, బరువు తగ్గించడంలో మరియు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో తోడ్పడుతుంది. ఇది శక్తి మరియు తృప్తిని ఇస్తుంది, దీర్ఘకాలిక ఆకలిని తగ్గిస్తుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారికి – పెసరపప్పు ఉత్తమం. బరువు తగ్గాలనుకునేవారికి – ఎర్రపప్పు చక్కటి ఎంపిక.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది