Election Code | స్థానిక ఎన్నికల కోడ్‌ అమల్లోకి.. బిల్లులు ఆగుతాయా? ఎస్‌ఈసీ స్పష్టత!

Authored By Sam C | The Telugu News | Published on: September 30, 2025, 2:00 pm

Election Code | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సమరం మొదలైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలు మినహాయించబడగా, మిగతా అన్ని జిల్లాల్లో ఈ నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఆదేశాలు జారీ చేసింది.

#image_title

ఈ నియ‌మాలు పాటించాలి..

ఈ కోడ్‌ అమలులోకి రావడంతో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల్లో కలకలం మొదలైంది. ఇప్పటివరకు బిల్లులు వచ్చినా, ఇకపై నిలిపేస్తారేమోనని భయపడుతున్నారు. ఎన్నికల ప్రక్రియ నవంబర్ 11తో ముగియనుండటంతో, అప్పటివరకు బిల్లులు ఆగిపోతాయని చాలామందిలో ఆందోళన ఉంది.అయితే, దీనిపై ఎస్‌ఈసీ స్పష్టత ఇచ్చింది. ఇప్పటికే ఇళ్ల పనులు మొదలుపెట్టినవారికి, ప్రామాణిక నిబంధనల ప్రకారం బిల్లులు చెల్లిస్తారు.

అంటే, పనులు కొనసాగుతున్నవారికి ఇబ్బంది ఉండదు. కానీ కొత్తగా ఇళ్ల నిర్మాణం మొదలుపెడితే, వాటికి సంబంధించిన బిల్లులు తాత్కాలికంగా ఆపివేస్తారు. అలాగే కొత్త లబ్ధిదారులకు సహాయం మంజూరు చేయరాదని కూడా ఎస్‌ఈసీ చెప్పింది.మ‌రోవైపు మంత్రులు లేదా అధికారులు కొత్త పథకాలు ప్రకటించకూడదు అని చెప్పుకొచ్చింది. ప్రభుత్వ వాహనాలు, సిబ్బందిని రాజకీయ ప్రయోజనాలకు వాడకూడదు.కోడ్ అమలులో ఉన్న ప్రాంతాల్లో లౌడ్‌స్పీకర్లు, ఊరేగింపులు, బహిరంగ సభలు నిషేధం. ఈ ఎన్నికల నియమావళి స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అమల్లో ఉంటుంది.

 

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp