Electric Scooters : ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి డిమాండ్ … ఈ ఆఫర్లు చూస్తే షాక్
Electric Scooters : పెట్రోల్ ధరలు మండిపోతుండటంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలవైపు చూస్తున్నారు. దీంతో ఎలక్ట్రిక్ టూ వీలర్లకు డిమాండ్ రోజురోజుకి పెరుగుతోంది. పైగా డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ వంటివి అవసరం లేకపోవడంతో మరింత ఆసక్తి చూపుతున్నారు. అయితే 250W మోటార్‌తో కూడిన తక్కువ పవర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు బైకులకు డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ లేకుండా 25 kmph కంటే ఎక్కువ వేగంతో నడపవచ్చు. కానీ హై-స్పీడ్ వాహనాల కోసం ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి. అయితే ఎలక్ట్రిక్ వాహనాల నుంచి పొల్యూషన్ లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తోంది.
మెయింటనెన్స్ ఖర్చులు కూడా తక్కువే.. ఒక్కసారి చార్జ్ చేస్తే 200 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు.బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ వెహికల్ మంచి డిమాండ్ తో దూసుకుపోతోంది. ఈ స్కూటర్ ధర 1.42 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. ఇది రెండు వేరియంట్లు, సిక్స్ కలర్స్ లో అందుబాటులో ఉంది. ఈ స్కూటర్ 3800 వాట్స్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీని ప్రయాణం 95 కి.మి వరకు ఉంటుంది. అలాగే ముందు డిస్క్ బ్రేకులు, వెనక డ్రమ్ బ్రేక్ లతో అందుబాటులో ఉంది.కాగా ఓకినావా ఓకి ఎలక్ట్రిక్ స్కూటర్ 1.21 లక్షలకు అందుబాటులో ఉంది. ఈ స్కూటర్ గంటకు 90 కి.మి ల వేగంతో… 200 కి.మి వరకు ప్రయాణం చేయవచ్చు. ఈ వెహికల్ లిథియం-ఆయాన్ బ్యాటరి కలిగి ఉంది.
అలాగే సింపుల్ వన్ ఈవీ ఒక్కసారి చార్జ్ చేస్తే 200 కి.మి వరకు ప్రయాణం చేయవచ్చు. ఈ వెహికల్ గంటకు 105 కి.మి వేగంతో ప్రయాణిస్తుంది.కాగా గంటకు 80 కి.మి వేగంతో అథర్ 450ఎక్స్ స్కూటర్ ముందు వెనక డిస్క్ బ్రెక్ లతో అందుబాటులో ఉంది. అలాగే రెండు వేరియంట్లు, మూడు కలర్స్ లో 1.40 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. ఇదులో టాప్ మోడల్ 1.59 లక్షలు. కాగా ఈ ఈవీ 3300 వాట్స్ పవర్ ను ఉత్పత్తి చేయనుంది.అలాగే ఓలా ఎస్1 ప్రో స్కూటర్ ధర రూ.1.27 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. ఇది కేవలం ఓకే వేరియంట్ లో అందుబాటులో ఉండనుంది. ఈ ఈవీ 5500 వాట్స్ పవర్ ని ఉత్పత్తి చేస్తుంది.