Electric Scooters : బడ్జెట్ లో బెస్ట్ ఈ-స్కూటర్స్ ఇవే.. కస్టమర్లకు అందుబాటు రేంజ్ లో
Electric Scooters : రోజురోజుకీ చమురు ధరలు పెరుగుతుండటంతో వాహనదారులు ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నారు. ఎలక్ట్రిక్ వెయికిల్స్ వైపు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈవీ వాహనాల తయారీలో పలు సంస్థలు పోటీ పతున్నాయి. అత్యాధునిక ఫీచర్స్.. బ్యాటరీ కెపాసిటీ.. స్పీడ్ వంటి స్పెసిఫికేషన్లు అందిస్తున్నాయి. ఇందులో ఇందులో మోడల్స్ బట్టి.. కెపాసిటీ బట్టి వీటి రేట్లు నిర్ణయించారు. బడ్జెట్ ధరల్లో ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేయాలనుకుంటే రూ. 45,000 నుంచి మొదలు రూ. 70,000 లోపు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) పరిధిలో అందుబాటులో ఉన్నాయి. అతితక్కువ ధరలలో సామాన్యులకి అందుబాటులో ఉన్న స్కూటర్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
అయితే హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్ ఈ – స్కూటర్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. LX VRLA, టాప్ వేరియంట్ Flash LX గా ఉన్నాయి. వీటి ధర రూ. 46,640 నుంచి మొదలై రూ. 59,640 వరకు ఉంది. హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్ గరిష్టంగా 25 కేఎంపీఎచ్ వేగంతో, 85 కేఎం/ఛార్జ్ రేంజ్ ఇవ్వగలదని సదరు కంపెనీ తెలిపింది. అలాగే బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు వేరియంట్లలో లాంచ్ చేశారు. బ్యాటరీ ప్యాక్ లేని ఇన్ఫినిటీ ఈ1 ధర రూ.45,099, బ్యాటరీ ప్యాక్‌తో కూడిన ఇన్ఫినిటీ ఈ1 ధర రూ.68,999 గా ఉంది. ఇది 1500 వాట్ల BLDC మోటార్‌ను కలిగి ఉంటుంది. ఇది 85 కిమీ/ఛార్జ్‌ల రేంజ్ ఉంటుందిని ఆ కంపెనీ పేర్కొంది.
Electric Scooters : తక్కువలో బెస్ట్..
అవన్ ట్రెండ్ ఈ.. ధర రూ. 56,900 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉంది. ఈ స్కూటర్ ఇది రెండు వేరియంట్‌లలో సింగిల్ బ్యాటరీ ప్యాక్, డబుల్ బ్యాటరీ ప్యాక్ అందుబాటులో ఉంది. సింగిల్ బ్యాటరీ పవర్డ్ వేరియంట్ 60 కిమీ పరిధిని కలిగి ఉంది. డబుల్ బ్యాటరీ పవర్డ్ వేరియంట్ 110 కిమీ పరిధిని కలిగి ఉంటుందని తెలిపింది. రెండు వేరియంట్‌ల గరిష్ట వేగం గంటకు 45 కి.మీ వేగంతో దూసుకెళ్తుంది. అవన్ ఈ స్కూటర్ ధర రూ. 45,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా నిర్ణయించింది. ఇది 215 వాట్ల BLDC మోటార్‌ను కలిగి ఉంటుంది. ఈ వెయికిల్ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి 6 నుంచి 8 గంటలు పడుతుందని సదరు కంపెనీ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి చార్జ్ చేస్తే 65 కిమీ రేంజ్ వరకు ప్రయాణిస్తుంది. అంతేకాకుండా 24 కిమీ గరిష్ట వేగంతో దూసుకెళ్తుందని తెలిపింది.