Varivo Motors : రూ.45 వేల‌కే ఎలక్ట్రిక్ స్కూట‌ర్స్.. ఏకంగా ఆరు మోడ‌ల్స్ కూడా …. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Varivo Motors : రూ.45 వేల‌కే ఎలక్ట్రిక్ స్కూట‌ర్స్.. ఏకంగా ఆరు మోడ‌ల్స్ కూడా ….

 Authored By ramu | The Telugu News | Updated on :6 June 2025,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Varivo Motors : రూ.45 వేల‌కే ఎలక్ట్రిక్ స్కూట‌ర్స్.. ఏకంగా ఆరు మోడ‌ల్స్ కూడా..

Varivo Motors : ఈ మ‌ధ్య చాలా మంది ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ని ఎక్కువ‌గా వినియోగిస్తున్నారు. ఈ క్ర‌మంలో వారివో మోటార్స్ అనే ఎలక్ట్రిక్ టూవీలర్ బ్రాండ్, కేవలం రూ.44,999 ప్రారంభ ధరతో ఆరు కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకొని వ‌చ్చింది. ఈ స్కూటర్లు మార్కెట్‌లో అత్యంత బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటిగా నిలుస్తాయి. వారివో ఇప్పటికే సీఆర్‌ఎక్స్ (CRX), జెడ్‌బి (ZB), ఎల్-1 ప్లస్ (L-1 Plus), ఎల్-2 (L-2), నెక్సా డీఎస్ (Nexxa DS) వంటి వివిధ ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణులను విక్రయిస్తోంది.

Varivo Motors  వెరైటీ మోడ‌ల్స్..

Varivo Motors రూ45 వేల‌కే ఎలక్ట్రిక్ స్కూట‌ర్స్ ఏకంగా ఆరు మోడ‌ల్స్ కూడా

Varivo Motors : రూ.45 వేల‌కే ఎలక్ట్రిక్ స్కూట‌ర్స్.. ఏకంగా ఆరు మోడ‌ల్స్ కూడా..

ఎడ్జ్ సిరీస్’ మాత్రం రోజువారీ ఉపయోగం కోసం, తక్కువ ధరలో ప్రయాణాన్ని అందించేలా తయారు చేశారు. ఎడ్జ్ ధర రూ.44,999 (ఎక్స్-షోరూమ్). దీనికి 195 mm గ్రౌండ్ క్లియరెన్స్, 800 mm సీట్ ఎత్తు ఉంటుంది. ఎడ్జ్+ ధర రూ.49,999 (ఎక్స్-షోరూమ్). దీనికి 175 mm గ్రౌండ్ క్లియరెన్స్, 760 mm సీట్ ఎత్తు ఉంటుంది.స నోవా సిరీస్: వారివో మోటార్స్ టాప్-ఆఫ్-లైన్ సిరీస్ ఇది. నోవా సిరీస్‌లో నోవా, నోవా-ఎక్స్, నోవా-ఎస్ (Nova-S) అనే మూడు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

ఈ మూడు స్కూటర్లు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తాయి. వీటికి కూడా 3 సంవత్సరాల వారంటీని ఇస్తారు. ఎంట్రీ లెవెల్ నోవా ధర రూ.55,999 (ఎక్స్-షోరూమ్), నోవా-ఎక్స్ ధర రూ.59,999 (ఎక్స్-షోరూమ్), నోవా-ఎస్ ధర రూ.64,999 (ఎక్స్-షోరూమ్). నోవాలో 810 mm సీట్ ఎత్తు, 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. నోవా ఎక్స్‎లో 140 mm గ్రౌండ్ క్లియరెన్స్, 775 mm సీట్ ఎత్తు ఉంది. నోవా ఎస్లో 170 mm గ్రౌండ్ క్లియరెన్స్, 780 mm సీట్ ఎత్తు ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి భారతదేశం అంతటా 200 కొత్త స్టోర్లను తెరవాలని ప్లాన్ చేసింది

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది