Epfo : ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్నఈపీఎఫ్ఓ మినిమమ్ పెన్షన్…!
Epfo : ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ త్వరలోనే ఓ శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఈపీఎఫ్ ఖాతాదారులకు సంబంధించి మినిమమ్ పెన్షన్ పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం. సుదీర్ఘ కాలంగా జరుగుతున్న చర్చల ఫలితంగా ఈ అంశంపై త్వరలోనే ఈపీఎఫ్ఓ తమ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు పీఎఫ్ చందాదారులకు ప్రయోజనం కలుగనుందని అంటున్నారు.తాజాగా వెలువడుతున్న నివేదికల ప్రకారం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉద్యోగుల కనీస పెన్షన్ ను రూ. 1000 నుంచి 9 వేల రూపాయలకు పెంచనునుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
త్వరలో జరగనున్న సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో… ఈ కనీస పెన్షన్ పెంపు అంశంపై చర్చ జరగవచ్చునని అంటున్నారు. ఉద్యోగుల ఎప్పటినుంచో ఈ కనీస పెన్షన్ ను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఖాతాదారులకు కనీస పెన్షన్ పెంచే ప్రతిపాదనలపై ఫిబ్రవరిలో… కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ జరపనున్న చర్చల్లో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న వార్తలొస్తున్నాయి. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సిఫార్సుల మేరకు ఈ కనీస పెన్షన్ పెంపు పై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. గత 2021 మార్చిలోనే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కనీస పెన్షన్‌ను రూ.1,000 నుంచి రూ.3,000 వరకు పెంచాలని సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే.
Epfo : రూ. 1000 నుంచి 9000 పెరగనున్న పెన్షన్..:
పదవీ విరమణకు ముందు చివరి నెలలో ఉండే శాలరీని బట్టి… ఈ పెన్షన్‌ను ఫిక్స్ చేయాలని ఎంతో కాలంగా డిమాండ్లు వస్తున్నాయి. అయితే కార్మిక మంత్రిత్వ శాఖ మాత్రం ఈ విషయంలో అంత సముఖంగా లేనట్లు సమాచారం. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ కింద ప్రావిడెంట్ ఫండ్ పొందే సబ్‌స్క్రయిబర్లందరికీ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్-1995 అందుబాటులో ఉంటుంది. ఉద్యోగులకు 58 ఏళ్ల తర్వాత పెన్షన్ లభిస్తుండగా.. వారు కనీసం పదేళ్ల పాటు తప్పనిసరిగా ఆ ఉద్యోగంలో ఉండి తీరాలి. ఈ స్కీమ్ కింద, ఎంప్లాయీ పేరు మీద 12 శాతం మొత్తాన్ని ఎంప్లాయర్ ఈపీఎఫ్‌లో జమ చేయాలి. దీంతో ఉద్యోగులు 58 ఏళ్ల తర్వాత వెయ్యి రూపాయిలు మినిమమ్ పెన్షన్ పొందుతున్నారు.