EPFO : త్వరలోనే ఉద్యోగుల ఖాతాల్లోకి పీఎఫ్ వడ్డీ అమౌంట్.. బ్యాలెన్స్ చెక్ చేసుకోండిలా..
EPFO : ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) ఖాతాదారులకి గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వం త్వరలో 2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని ఖాతాలలో జమచేయనుంది. ఈ సారి 8.1 శాతం వడ్డీ లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈపీఎఫ్‌వో 2022 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ ఖాతాలలోకి వచ్చే వడ్డీని ఇప్పటికే లెక్కించినట్లు చెబుతున్నారు. ఇక త్వరలోనే ఈ వడ్డీ అమౌంట్ ని ఉద్యోగుల ఖాతాల్లోకి బదిలీ చేయనుంది. గత ఏడాది పీఎఫ్ ఖాతా డబ్బులపై వడ్డీ కోసం 6 నుంచి 8 నెలలు ఎదురు చూడాల్సి వచ్చింది.
కానీ ఈసారి ఆలస్యం చేయడం లేదు. మీడియా నివేదికల ప్రకారం జులై 15 వరకు వడ్డీ డబ్బులు ఉద్యోగుల ఖాతాల్లో జమ కానున్నాయి. అయితే ఈసారి వడ్డీ 40 ఏళ్లలో అత్యల్పంగా ఉందన్న విషయం తెలిసిందే. అయితే ఖాతాదారులు బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. మీ పీఎఫ్ అకౌంట్ డబ్బుల బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి 011-22901406 నెంబర్‌కు మిస్డ్‌కాల్ ఇచ్చి తెలుసుకోవచ్చు. ఆ తరువాత ఈపీఎఫ్ఓ నుంచి మెస్సేజ్ ద్వారా బ్యాలెన్స్ వివరాలు వస్తాయి. ఇక్కడ కూడా యూఏఎన్ నెంబర్, పాన్ నెంబర్, ఆధార్ కార్డు లింక్ అవడం తప్పనిసరి.
EPFO: వెబ్ సైట్ లో ఇలా చేస్తే..
ఇక ఆన్‌లైన్ ద్వారా కూడా మీ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. దీనికోసం ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్ epfindia.gov.in ఓపెన్ చేయాలి. ఈ పాస్‌బుక్‌పై క్లిక్ చేస్తే కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో passbook.epfindia.gov.in కు వెళ్లాలి. ఇప్పుడు తమ యూఏఎన్ నెంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా ఎంటర్ చేయాలి. అన్ని వివరాలు నమోదు చేసిన తురవాత కొత్త పేజి ఓపెన్ అవుతుంది. అందులో మెంబర్ ఐడీ ఆప్షన్ ఎంచుకోవాలి. వెంటనే తమ పీఎఫ్ బ్యాలెన్స్ కన్పిస్తుంది.