KCR : రిపబ్లిక్ డే రోజు కేసీఆర్‌ రాజ్యాంగంను అవమానించాడు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

KCR : రిపబ్లిక్ డే రోజు కేసీఆర్‌ రాజ్యాంగంను అవమానించాడు

 Authored By himanshi | The Telugu News | Updated on :27 January 2022,12:30 pm

KCR : తెలంగాణ సీఎం కేసీఆర్‌ పై మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. రిపబ్లిక్ డే సాక్షిగా సీఎం కేసీఆర్ రాజ్యాంగంను అవమానించాడు అంటూ ఈటెల ఆరోపించాడు. ప్రతి ముఖ్య మంత్రి కూడా రిపబ్లిక్ డే సందర్బంగా రాజ్‌ భవన్ లో జరిగే వేడుకలో పాల్గొనడం ఆనవాయితీగా వస్తుంది. రాజ్యాంగ బద్దంగా నియమించబడ్డ గవర్నర్ కు సీఎం కేసీఆర్‌ గౌరవం ఇవ్వలేదు. కనీసం సీనియర్ మంత్రులు ఎవరు కూడా రిపబ్లిక్ డే సందర్బంగా రాజ్ భవన్ లో జరిగిన వేడుకల్లో హాజరు కాకపోవడం విచారకరం అంటూ ఈటెల అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రజాస్వామ్యవాదులు ఎంతో ఆవేదన చెందే సంఘటన ఇది. రాజ్ భవన్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో హాజరు కాకపోవడం అనేది గవర్నర్ ను అవమానించినట్లే అంటూ ఈటెల పేర్కొన్నారు.

రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనక పోవడం అనేది ముమ్మాటికి రాజ్యాంగంను ఉల్లంఘించడం అవుతుందని కేసీఆర్ పై ఈటెల తీవ్ర విమర్శలు చేశారు. ఒక ముఖ్య మంత్రి రాజ్యాంగంను అపహాస్యం చేయడం దారుణం. రాష్ట్ర గవర్నర్‌ స్థానంను అవమానించడం మాత్రమే కాకుండా రాజ్యాంగంను పట్టించుకోవడం లేదని ఈటెల ఆరోపించాడు. ప్రగతి భవన్ లో జరిగిన రిపబ్లిక్ డే కార్యక్రమాల్లో మంత్రులు మాట్లాడిన తీరు కూడా ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఈటెల పేర్కొన్నాడు. ముఖ్యంగా స్పీకర్ పోచారం మాట్లాడిన తీరు రాజ్యాంగం మీద విషం కక్కినట్లు ఉందని ఈటెల పేర్కొన్నాడు.

etela rajendar comments on cm kcr

etela rajendar comments on cm kcr

KCR : ఎంపీ అరవింద్ పై దాడిపై ఈటెల రియాక్షన్‌

ఇటీవల ఎంపీ ధర్మపురి అరవింద్ పై టీఆర్‌ఎస్ కార్యకర్తలు మరియు రైతులు చేసిన దాడి కూడా రాజ్యాంగ విరుద్దం అంటూ ఆరోపించాడు. కేసీఆర్ గతంలో మాదిరిగా ఇప్పుడు తన మాటలతో జనాలను ఒప్పించే శక్తి కోల్పోయాడు. జనాలను అందుకే బీజేపీ నాయకులపై దాడి చేయిస్తున్నాడు అంటూ ఈటెల పేర్కొన్నాడు. టీఆర్ఎస్ కార్యకర్తలను బీజేపీ నాయకులపైకి ఉసి గొల్పడం దారుణం. రాజ్యాంగంలో ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఈటెల రాజేందర్ బీజేపీ నాయకులపై దాడిని ఖండించడంతో పాటు ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేయక పోవడం పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది