etela rajender meets bjp kishan reddy
Etela Rajender : ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా ఈటల రాజేందర్ గురించే చర్చ. దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉండి.. సీఎం కేసీఆర్ వెంట ఆప్తుడిగా ఉండి.. టీఆర్ఎస్ పార్టీ గెలుపులో, తెలంగాణ సాధనలో ముఖ్య పాత్ర పోషించిన ఈటల రాజేందర్ పరిస్థితి ప్రస్తుతం బాగా లేదు. తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్ తనదైన ముద్ర వేశారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు ఆయన తెలంగాణ కోసం, తెలంగాణ బాగు కోసం బాగానే కష్టపడ్డారు. కానీ.. సొంత పార్టీలోనే ఆయన బహిష్కరణకు గురయ్యారు. భూకబ్జా ఆరోపణలతో ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి సీఎం కేసీఆర్ తొలగించిన విషయం తెలిసిందే. ఆయన్ను బర్తరఫ్ చేయడంతో ప్రస్తుతం ఈటల రాజేందర్ హుజూరాబాద్ ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు. అయితే.. ఈటల పార్టీ మీద కోపంతో.. పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని అంతా భావించారు కానీ.. ఈటల రాజేందర్ ఇఫ్పుడు ఆచీతూచీ అడుగు వేస్తున్నారు.
etela rajender meets bjp kishan reddy
అందుకే.. మంత్రివర్గం నుంచి తనను తొలగించాక.. ఈటల రాజేందర్ తెలంగాణలోని ముఖ్యమైన నేతలతో సమావేశమవుతున్నారు. తన అభిమానులతో, అనుచరులతో కూడా ఇప్పటికే సమావేశం అయ్యారు. కొత్త పార్టీ పెడితే బాగుంటుందా? లేక వేరే పార్టీలో చేరితు బాగుంటుందా? అనే అంశంపై ఆయన పలువురు నేతలతో చర్చిస్తున్నారు. అయితే.. ఈటల రాజేందర్.. కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరుతారని వార్తలు వచ్చినప్పటికీ.. అవన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి. కాకపోతే తాజాగా ఈటల రాజేందర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అవడంతో మరోసారి ఆయన పార్టీ మారుతున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్ కు సమీపంలోని ఓ ఫామ్ హౌజ్ లో ఈటల రాజేందర్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయినట్టు తెలుస్తోంది. తన రాజకీయ భవిష్యత్తుపై కిషన్ రెడ్డితో ఈటల చర్చించారట. ఈటల కొత్త పార్టీ పెట్టబోతున్నారని ఈ మధ్య వార్తలు వస్తున్న నేపథ్యంలో.. తన కొత్త పార్టీ విషయమై ఈటల రాజేందర్.. కిషన్ రెడ్డిని కలిశారా? లేక.. బీజేపీలో చేరేందుకు వీళ్లిద్దరు భేటీ అయ్యారా? అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా.. లాక్ డౌన్ వేల.. ఇంత అర్జెంట్ గా ఇద్దరూ భేటీ అయ్యారంటే.. ఖచ్చితంగా వాళ్ల మధ్య నేటి రాజకీయ పరిస్థితులు.. ప్రభుత్వ వ్యవహారాలు, టీఆర్ఎస్ రాజకీయాలు అన్నీ చర్చకు వచ్చి ఉంటాయి. మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ కు చెందిన ఫాంహౌస్ లో వీళ్లిద్దరూ భేటీ అయ్యారట. వీళ్లతో పాటు.. బీజేపీ జాతీయ నేత భూపేందర్ యాదవ్ కూడా ఉన్నారట. కాంగ్రెస్ కు చెందిన ఓ ఎమ్మెల్యే కూడా ఈ భేటీలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. వీళ్ల భేటీ అనంతరం ఈటల ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…
Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…
Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్‌తో పాటు కమర్షియల్ ఎక్స్‌పర్‌మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్…
This website uses cookies.